నగరంపాలెం: గుంటూరు జిల్లా పోలీస్‌శాఖలో 14 ఏళ్లు సేవలందించిన పోలీస్ డాగ్ ‘రాజా’ సోమవారం మృతి చెందింది. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలోని డాగ్ స్క్వాడ్ యూనిట్‌లో పోలీస్ లాంఛనాలతో వీడ్కోలు పలికారు. ప్రత్యేక విభాగంలో పనిచేస్తూ, పలు కేసుల ఛేదనలో కీలకపాత్ర పోషించి పోలీస్ శాఖ కు విశేష సేవలందించినట్లు గుర్తుచేసుకున్నారు. ఆర్‌ఐ అడ్మిన్ కృష్ణయ్య, డాగ్ ఇన్‌చార్జి రవీంద్రబా బు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది నివాళులర్పించారు.
నేటి నుంచి న్యాయవాదులు
విధులకు దూరం
గుంటూరు లీగల్: న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నుంచి విధులకు దూరంగా ఉండాలని గుంటూరు జిల్లా న్యాయవాదుల ఫెడరేషన్, గుంటూరు బార్ అసోసియేషన్ పిలుపునిచ్చాయి. సోమవారం నిర్వహించిన సమావేశం వివరాలను గుంటూరు జిల్లా న్యాయవాదుల ఫెడరేషన్ అధ్యక్షుడు మధిర నాగేశ్వరరావు, గుంటూరు బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెల్లడించారు. న్యాయవాదులపై దాడులను అరికట్టడంతో పాటు, న్యాయవాదుల ప్రాణాలకు, వృత్తిపరమైన విధులకు తగిన రక్షణ కల్పించేందుకు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని సమావేశం డిమాండ్ చేసినట్లు చెప్పారు. మంగళవారం నుంచి 21వ తేదీ వరకు వృత్తిపరమైన విధులకు హాజరుకాకూడదని సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించినట్లు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తికి కూడా లిఖితపూర్వకంగా వినతిపత్రం సమర్పించినట్లు చెప్పారు.
పీజీఆర్‌ఎస్ వద్ద
పెట్రోల్ డబ్బాతో హల్‌చల్
నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో పీజీఆర్‌ఎస్ వద్ద అడవితక్కెళ్లపాడు రాజీవ్‌గృహాకల్పలో ఉంటున్న ఆటోడ్రైవర్ రాజు పెట్రోల్ డబ్బాతో రావడం కలకలం రేపింది. వివరాలు.. మారుతీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి వద్ద గతేడాది రూ.40 వేలు అప్పు తీసుకుని, నెల నెలా అతనికి అసలు, వడ్డీ చెల్లిస్తున్నట్లు చెప్పారు. బాకీ తీరకపోవడంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నానని పేర్కొన్నారు. అతడి నుంచి రక్షణ కల్పించి, రుణ బాకీ సమస్యను తీర్చాలని కోరుతున్నట్లు వాపోయాడు. ఈ క్రమంలో పెట్రోల్ డబ్బాతో జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగే పీజీఆర్‌ఎస్‌కు వచ్చినట్లు చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద తనిఖీలు నిర్వర్తించే క్రమంలో రాజు వద్ద పెట్రోల్ డబ్బాను గుర్తించారు. అనంతరం అతని నుంచి పెట్రోలు డబ్బాను స్వాధీనం చేసుకుని, తరువాత లోపలికి అనుమతించారు.
రాష్ట్ర యోగా ఓవరాల్
చాంపియన్‌గా గుంటూరు జిల్లా
గుంటూరు వెస్ట్(క్రీడలు): ఈ నెల 10, 11 తేదీల్లో నెల్లూరు జిల్లా కావలిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 39వ రాష్ట్రస్థాయి యోగాసనా చాంపియన్‌షిప్‌ను గుంటూరు జిల్లా కై వసం చేసుకుందని జిల్లా కన్వీనర్ కొండా శ్రీలత సోమవారం తెలిపారు. పోటీల్లో 4 బంగారు, 5 రజిత, 3 కాంస్యలతో సహా మొత్తం 12 పతకాలు సాధించి క్రీడాకారులు మంచి పేరుతెచ్చాన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులు జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్‌లో డిసెంబర్ 27 నుంచి నిర్వహించనున్న జాతీయ పోటీల్లో పాల్గొంటారన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారుల్ని రాష్ట్ర జనరల్ సెక్రటరీ అల్లాడి రవికుమార్ అభినందించారు.


