ప్లాట్‌లు తనఖా పెట్టి ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

ప్లాట్‌లు తనఖా పెట్టి ఇబ్బందులు

Oct 13 2026 1:47 AM | Updated on Oct 13 2026 1:47 AM

న్యాయం చేయాలని ఓ అంధుడి వినతి పీజీఆర్‌ఎస్‌కు భారీ స్పందన ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ వకుల్‌ జిందాల్‌

నగరంపాలెం: టిడ్కో ప్లాట్‌లను తనఖా పెట్టిన మరదలపై చర్యలు తీసుకోవాలని ఓ అంధుడు, అతడి తల్లి ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో పీజీఆర్‌ఎస్‌ నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ బాధితుల నుంచి 147 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులపై సంబంధిత పోలీస్‌ అధికారులతో జిల్లా ఎస్పీ మాట్లాడారు. ప్రతి ఫిర్యాదు చట్టబద్ధంగా పరిశీలించాలని సూచించారు. బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. ఫిర్యాదిదారులు, సహా యకులకు అమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి, డీఎస్పీలు పూర్ణచంద్రరావు(దక్షిణ), బెల్లం శ్రీనివాసరావు(పశ్చిమ) కూడా ఫిర్యాదులు స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement