ప్రైవేట్‌ ఫైనాన్స్‌ అరాచకాలు | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ ఫైనాన్స్‌ అరాచకాలు

Oct 13 2026 1:47 AM | Updated on Oct 13 2026 1:47 AM

డాక్యుమెంటేషన్‌ పూర్తికాకుండానే కొనుగోలుదారులకు బెదిరింపులు ఆటోలో ఉన్న బంగారం, ఆటోతో సహా ఉడాయింపు బంగారం అడిగితే బెదిరింపులు

తాడేపల్లి రూరల్‌: రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకూ ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఓ యువకుడు తన కుటుంబ పోషణ నిమిత్తం కొనుగోలు చేసిన ఆటోకు సంబంధించిన సంబంధిత పత్రాలను ఇవ్వకుండానే ఆటోను, ఆటోలో ఉన్న బంగారపు చైన్‌తో సహా చెప్పకుండా తీసుకువెళ్లిన సంఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితుడు ఆటో డ్రైవర్‌ పెరవలి తిరుపతిరావు తెలిపిన వివరాల ప్రకారం .. ‘నూతక్కి గ్రామంలో నివాసముండే తాను విజయవాడలోని శ్రీ లక్ష్మీ నరసింహ ప్రైవేటు ఫైనాన్స్‌ వారికి రూ.40,000 చెల్లించి ఆటో కొనుగోలు చేశాను. బండికి సంబంధించిన అన్ని పత్రాలు అందించలేదు. పత్రాలు లేకుండా ఆటోను నడపనని, తాడేపల్లి రూరల్‌ కొలనుకొండలోని మేనమామ శివశంకర్‌ ఇంటి వద్ద రోడ్డుపై నిలిపాను. ఆ ఆటోను శ్రీలక్ష్మీ నరసింహ ఫైనాన్స్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు వచ్చి అక్టోబర్‌ 1వ తేదీ ఉదయం 10–11 గంటల సమయంలో ఆటో తాళాలు లేకపోయినా ఒకరు వ్యక్తి స్టీరింగ్‌ దగ్గర కూర్చొని, మరో వ్యక్తి కాలితో నెట్టుకుంటూ తీసుకువెళ్లారు. ఫైనాన్స్‌ కంపెనీ వారికి ఫోన్‌ చేసి ఆటోలో బంగారం చైన్‌ ఉంది, దానిని నాకు ఇవ్వమని కోరాను, అది మా దగ్గరే ఉంది, ఆఫీసుకు వచ్చి తీసుకోమంటూ’ చెప్పారు. మీరు డాక్యుమెంట్లు ఇవ్వకుండా ఆటోను ఎలా తీసుకువెళతారని అడిగాను. పోలీస్‌ కేసు పెడతానని కూడా చెప్పాను. పోలీస్‌స్టేషన్‌లో తేల్చుకుందామని వారు అన్నారు. అదేరోజు తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, ఇప్పటి వరకు నాకు న్యాయం జరగలేదని, పోలీసులు నా ఆటో, బంగారపు చైన్‌ ఇప్పించాలని తిరుపతిరావు విన్నవించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement