అండర్‌–19 ఉమ్మడి గుంటూరు జిల్లా క్రికెట్‌ జట్టు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

అండర్‌–19 ఉమ్మడి గుంటూరు జిల్లా క్రికెట్‌ జట్టు ఎంపిక

Oct 7 2026 2:10 AM | Updated on Oct 7 2026 2:10 AM

అండర్‌–19 ఉమ్మడి గుంటూరు జిల్లా క్రికెట్‌ జట్టు ఎంపిక

చిలకలూరిపేట: ఉమ్మడి గుంటూరు జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌ –19 క్రికెట్‌ జట్టు ఎంపికను పట్టణంలోని హేలియోస్‌ క్రీడామైదానంలో మంగళవారం నిర్వహించారు. బాలుర జట్టు ఎంపిక కార్యక్రమాన్ని స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ సెక్రటరీ నరసింహారావు, హేలియోస్‌ స్కూల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జి రాజేష్‌ ప్రారంభించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వివిధ పాఠశాలల నుంచి 115 క్రీడాకారులు ఎంపికలో పాల్గొన్నారు. వీరి నుంచి జితేంద్రనాయుడు, పి రోహన్‌, ఎం శశాంక్‌, శ్రీనివాస్‌నాయక్‌, సీహెచ్‌ సుందర్‌సింగ్‌, సీహెచ్‌ దేవకుమార్‌, ఎన్‌ కళ్యాణ్‌, గోపిచంద్‌, పి కృపాక్షిన్‌, యశ్వంత్‌రెడ్డి, మహిమకుమార్‌, ప్రేమ్‌కార్తీక్‌, జి ఉజ్వల్‌, సీహెచ్‌ దివాకర్‌, స్నేహిల్‌ వర్ష, బి శివలను ఎంపిక చేశారు. చిత్తూరు జిల్లా నగరిలో ఈ నెల 10 నుంచి 12 వరకు జరిగే రాష్ట్రస్థాయి అండర్‌–19 బాలుర క్రికెట్‌ పోటీలలో జిల్లా జట్లు పాల్గొంటుంది. కార్యక్రమంలో సెలక్టర్లుగా సుధాకరరెడ్డి, పద్మాకర్‌, ఖాసింబుడే, పొదిలి వెంకటేశ్వరరావు, ఏఎంజీ రాజు, సీవీ రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement