గుంటూరు వెస్ట్: సోలార్ పవర్‌ను ఉపయోగించుకోవడం ద్వారా ప్రజలు విద్యుత్ బిల్లులు గణనీయంగా తగ్గించుకునే వీలుంటుందని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. సేవా సేతు అభియాన్ పోస్టర్‌ను సోమవారం కలెక్టర్ తన కార్యాలయంలో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ – ముఫ్త్ బిజిలీ యోజనలో భాగంగా సేవా సేతు అభియాన్ క్యాంపులను నిర్వహిస్తారన్నారు. ప్రతి ఇంటికి సౌర విద్యుత్‌ను చేరువ చేయడం, రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన కల్పించడమే సేవా సేతు అభియాన్ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఇంటి పైకప్పుపై సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను గణనీయంగా తగ్గించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా అర్హత కలిగిన గృహ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందన్నారు. రూ.78 వేల వరకు సబ్సిడీ లభిస్తుందని వివరించారు. విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీర్లు సి.హెచ్.రమేష్, సుధాకర్, కార్యనిర్వహక ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.
మానసిక ఆరోగ్యంపై అవగాహన అవసరం..
గుంటూరు వెస్ట్: మానసిక ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అవగహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. మానసిక ఆరోగ్య వారోత్సవాలను పురస్కరించుకుని సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో ప్రత్యేక పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడం, మానసిక సమస్యలపై ఉన్న అపోహలను తొలగించడమే ధ్యేయంగా ఈ నెల 4 నుంచి 10వ తేదీ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జీజీహెచ్ మానసిక ఆరోగ్య విభాగాధిపతి డాక్టర్ ఉమా జ్యోతి, ఆచార్య డాక్టర్ వి.వి.కిరణ్, సహాయ ఆచార్యులు డాక్టర్ సతీష్, తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ పోస్టర్లు విడుదల...
సామూహిక ఎలుకల నియంత్రణా కార్యక్రమానికి సంబంధించిన వ్యవసాయ పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేశారు.
పూర్తిచేసిన పనుల బిల్లులు అప్‌లోడ్ చేయాలి..
వీబీజీ రామ్‌జీ పథకం కింద పూర్తి చేసిన పనుల బిల్లులు శుక్రవారం నాటికి అప్‌లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ఆదేశించారు. వివిధ శాఖల ప్రగతిపై సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీసి హాల్లో కలెక్టర్ జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా అధికారులతో సమీక్షించారు.
సేవా సేతు అభియాన్
పోస్టర్లు విడుదల చేసిన కలెక్టర్


