అంబటిపై ఆగని వేధింపుల పర్వం | - | Sakshi
Sakshi News home page

అంబటిపై ఆగని వేధింపుల పర్వం

Oct 6 2026 2:12 AM | Updated on Oct 6 2026 2:12 AM

అంబటిపై ఆగని వేధింపుల పర్వం

రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో భాగంగా మరో అక్రమ కేసు కిర్లంపూడి ఘటనపై నోటీసు ఇచ్చిన పోలీసులు

గుంటూరు ఎడ్యుకేషన్‌: రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో ప్రతిపక్షాలపై, ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసుల పర్వం కొనసాగుతోంది. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల రోజున కిర్లంపూడిలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించి, ముద్రగడ కుటుంబ సభ్యులపై దాష్టీకాన్ని ప్రదర్శించిన పోలీసులు తమ తప్పులను కప్పి పుచ్చుకుని వైఎస్సార్‌ సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా నాడు ముద్రగడ అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబుకు నోటీసు ఇచ్చారు. సోమవారం గుంటూరు సిద్ధార్థనగర్‌లోని అంబటి రాంబాబు కార్యాలయానికి వచ్చిన కిర్లంపూడి ఎస్‌ఐ సతీష్‌ ఈనెల 8వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసు ఇచ్చారు. ముద్రగడ పద్మనాభానికి ఆయన స్వస్థలమైన కిర్లంపూడిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను ఆయన కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు అంగీకరించని ముద్రగడ కుటుంబ సభ్యులపై పోలీసుల దురుసు ప్రవర్తనను అడ్డుకున్న అంబటి రాంబాబుతో పాటు మరి కొందరు వైఎస్సార్‌ సీపీ నేతలపై పోలీసులు ఇష్టారాజ్యంగా కేసులు పెట్టారు. గతంలో పెట్టిన అక్రమ కేసు విచారణలో భాగంగా ఈనెల 8న కిర్లంపూడిలో హాజరు కావాలని తాజాగా నోటీసు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement