అర్జీల పరిష్కారం పారదర్శకంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారం పారదర్శకంగా నిర్వహించాలి

Oct 6 2026 2:12 AM | Updated on Oct 6 2026 2:12 AM

జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ

గుంటూరు వెస్ట్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలు మరింత వేగంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీదారు సంతృప్తి మేరకు పరిష్కారం కావాలని, దీనిపై సంబంధిత శాఖల అధికారులు దృష్టి సారించాలన్నారు. అర్జీలు పరిష్కారంలో ఎటువంటి అలసత్వం ఉండకూడదని చెప్పారు. ఇప్పటికీ కొంత మంది సిబ్బంది పదే పదే అర్జీదారులను తిప్పుకొంటున్నారన్నారు. ఈ విధానం మారాలని స్పష్టం చేశారు. అనంతరం వచ్చిన 360 అర్జీలను జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, డీఆర్వో షేక్‌ ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్‌ గంగరాజు, జిల్లా అటవీ అధికారి ఎం.హిమ శైలజ, జడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, డీపీఓ బి.వి.నాగసాయికుమార్‌, జిల్లా అధికారులు పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement