ప్రముఖ గాయని ఎస్పీ శైలజ
ఏఎన్‌యూ(పెదకాకాని): సంగీతం శ్రద్ధగా నేర్చుకుని సాధన చేయడం ద్వారా సంగీత రంగంలో రాణించవచ్చని ప్రముఖ గాయని డాక్టర్ ఎస్పీ శైలజ అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం డాక్టర్ శైలజ దంపతులు విచ్ఛేశారు. తొలుత జ్యోతి ప్రజ్వలన, ప్రముఖ గాయకుడు, నటుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శైలజ మాట్లాడుతూ సంగీతంనపై ఆసక్తి ఉంటే సాధన ద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు. వీసీ కె.గంగాధరరావు మాట్లాడుతూ సంగీతం, పాటలు ఒత్తిడిని దూరం చేస్తాయన్నారు. కార్యక్రమంలో సినీనటుడు సుధాకర్ పాల్గొన్నారు.


