గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Aug 4 2026 1:23 AM | Updated on Aug 4 2026 1:23 AM

మంగళవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2026 సాగునీటి కోసం రైతుల భగీరథ యత్నం నిమ్మకాయల ధరలు పులిచింతల సమాచారం సాగర్‌ నీటి మట్టం 15 వరకు పంటల బీమా గడువు పొడిగింపు

న్యూస్‌రీల్‌

సబ్సిడీపై మోటార్లు అందించాలి...

సాగుభూముల్లో ఎడాపెడా బోర్లు కొల్లిపర మండలంలో రెండు నెలల్లో 250–300 బోర్లు ఒక్కో బోరుకు రూ.లక్షన్నర ఖర్చు సాగుకు నీరివ్వలేమని పాలకులు చేతులెత్తేసిన ఫలితం ఇది.. పంటలు కాపాడుకోవడానికే అంటున్న రైతులు

బోర్లకు డిమాండ్‌ పెరిగింది...

యుద్ధ ప్రాతిపదికన బోర్లు

మంగళవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2026
సాగునీటి కోసం రైతుల భగీరథ యత్నం

7

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.4000, గరిష్ట ధర రూ.7600, మోడల్‌ ధర రూ.5400 వరకు పలికింది.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.9183 టీఎంసీలు. విద్యుత్‌ ఉత్పత్తి నిమిత్తం ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు.

మాచర్ల: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం సోమవారం 513.10 అడుగులుగా ఉంది. తెలంగాణ లోని ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

జిల్లా కలెక్టర్‌ ిసీఎం సాయికాంత్‌ వర్మ

గుంటూరు వెస్ట్‌: పంటల బీమా గడువు ఈనెల 15 వరకు పొడిగించారని జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీసీ హాల్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వంద శాతం రైతులు పంట బీమా చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే 15, 20 రోజులపాటు తహసీల్దార్‌, వ్యవసాయ అధికారులు, ఏపీఎం క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. పంటలకు సరిపడా సాగునీరు అందుబాటులో ఉండే అవకాశం లేనట్లు జలవనరులు శాఖ తెలియజేసిందని, దానికనుగుణంగా రైతులకు ప్రత్యామ్నాయ పంటలకు వెళ్లాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నందున ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహించాలన్నారు. మండలాల వారీగా పంట విస్తీర్ణం వివరాలు సమర్పించాలని పేర్కొన్నారు. కౌలు రైతులకు సి.సి.ఆర్‌ కార్డులు జారీ చేయాలని చెప్పారు. గ్రీన్‌ గుంటూరులో భాగంగా జిల్లాలోని మున్సిపల్‌ కమిషనర్‌లు, ఎంపీడీఓలు పెద్దఎత్తున మొక్కలు నాటి ఆయా ప్రదేశాలను, రహదారికి ఇరువైపుల ఆహ్లాదకరంగా తయారు చేయాలని తెలిపారు. ప్రతి మొక్కను జియో ట్యాగింగ్‌ చేయాలన్నారు. వీబీ జీ రామ్‌ జీ కింద వేతనదారులు ఎక్కువ సంఖ్యలో భాగస్వామ్యం అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న 22(ఎ) కేసులను ఆగస్టు 15 నాటికి పరిష్కరించాలన్నారు. గృహ పట్టాల రెగ్యులరైజేషన్‌పై దృష్టి సారించాలని కలెక్టర్‌ తెలిపారు. ఈ నెల 13వ తేదీన సీడ్‌ యాక్సస్‌ రహదారి ప్రారంభోత్సం జరిగే అవకాశం ఉందని చెప్పారు. జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, డీఆర్వో షేక్‌ ఖాజావలి, జడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి, ముఖ్య ప్రణాళిక అధికారి పి.శేషశ్రీ, డీపీఓ బి.వి.నాగ సాయికుమార్‌, అధికారులు పాల్గొన్నారు.

తెనాలి: సూపర్‌ ఎల్‌నినో ప్రభావంపై వాతావరణ శాఖ హెచ్చరికలు ఎప్పట్నుంచో ఉన్నాయి. అయినా ప్రభుత్వం ఖరీఫ్‌ సాగు నిమిత్తం పంటకాల్వలకు నీటి విడుదల షెడ్యూలును గత మే నెలలోనే ప్రకటించింది. వరిసాగుకు అవసరమైన విత్తనాలను సబ్సిడీపై అందజేశారు. సీజను ఆరంభం నుంచి వ్యవసాయశాఖ ‘పొలం పిలుస్తోంది’ షెడ్యూలును అమలుచేస్తోంది. వరి వెదజల్లాక సాగునీరు ఇవ్వలేం...వరిసాగు చేయొద్దంటూ ప్రభుత్వం ప్రకటించటం రైతులను తీవ్ర నిరాశపరచింది. పంటలను కాపాడుకునేందుకు అందుబాటులో ఉన్న నీటివనరులను వినియోగిస్తూ, అవకాశం లేని అన్నదాతలు భారీ వ్యయంతో తమ పంటపొలాల్లో బోర్లు వేయిస్తున్నారు. భూగర్భజలాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఇందుకు వ్యయప్రయాసలనూ లెక్కజేయటం లేదు.

నీటి విడుదల లేక..

మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల నుంచి తెనాలి, వేమూరు, రేపల్లె, పొన్నూరు, బాపట్ల నియోజకవర్గాలతోపాటు ప్రకాశం జిల్లాలోని కొంత ఆయకట్టు కలిపి కృష్ణా పశ్చిమడెల్టాగా వ్యవహరిస్తారు. ఇందులో గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో దాదాపు 5.20 లక్షల ఆయకట్టు ఉండగా, ప్రకాశం జిల్లాలో మరో 50 వేల ఆయకట్టు ఉంది. ఈ మొత్తానికి సీతానగరం నుంచి సాగునీటిని విడుదల చేస్తుంటారు. ఈ సంవత్సరం షెడ్యూలు ప్రకారం జూలై 10వ తేదీన సాగునీటిని విడుదల చేయాల్సివుండగా, అయిదురోజులు ఆలస్యంగా 15వ తేదీన జలవనరులశాఖ మంత్రి షెడ్యూల్‌ విడుదల చేశారు. పట్టిసీమ నుంచి విడుదల చేసిన నీరు ఏమాత్రం పంటభూములకు ఎక్కే పరిస్థితి కనిపించటం లేదు.

వరికి నో.. మరి ఏం చేయాలో

ఎప్పటికి చెప్పేనో..!

మరోవైపు ప్రభుత్వం వరిసాగు వద్దని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెబుతూ వస్తోంది. వరిసాగుకు సాగునీటిని ఇవ్వలేమని కూడా ఖరాకండీగా పాలకులు చెప్పేశారు. కృష్ణాడెల్టా ఆయకట్టు స్థిరీకరణ కోసం నిర్మించిన పులిచింతల ప్రాజెక్టులో 29 టీఎంసీల నీటి నిల్వలు ఉంచుకుని, అందులోంచి నీటిని ఇవ్వకపోవటాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు. అదేమంటే 2027 జూన్‌ నాటికి దిగువ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిల్వ చేస్తామని జలవనరులశాఖ అధికారులు చెప్పటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పశ్చిమ డెల్టాలోని మాగాణి భూముల్లో వరిపైరు మినహా మరో పంటకు ఆస్కారం లేదని రైతులు గుర్తుచేస్తున్నారు. అలాంటప్పుడు ప్రత్యా మ్నాయ పంటలు వేసుకోమని చెబుతున్న ప్రభుత్వం, ఏయే పంటలు వేసుకోవాలి? విత్తనాలు ఎప్పుడిస్తారు? అనే అంశాలపై మాత్రం నోరు మెదపకపోవటం నివ్వెరపరుస్తోంది. పశ్చిమడెల్టాకు ఇప్పటివరకు పంటలకు అవసరమైన స్థాయిలో నీరు విడుదల కావటం లేదు. వరిసాగుకు కనీసం 6 వేల క్యూసెక్కులు ఇవ్వాల్సిన తరుణంలో ఆదివారం 2,519 క్యూసెక్కులు, సోమవారం 2,720 క్యూసెక్కులను విడుదల చేశారు.

పశ్చిమడెల్టాలో ముందుగా సాగు ఆరంభించే కొల్లిపర మండల రైతులు, దాదాపు 15 వేల ఎకరాల్లో వరి వెదజల్లారు. మెట్ట భూముల్లో 1935 ఎకరాల్లో పసుపు, 1508 ఎకరాల్లో అరటి, నిమ్మ 87, మినుములు 818, కూరగాయలు 55, పండ్లసాగు 15 ఎకరాల చొప్పున ఉంది. వరితోపాటు ఇతర పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం ఆరంభించారు. గత 45 రోజుల్లోనే కొల్లిపర మండలంలో 250–300 బోర్లు వేయించి ఉంటారని అంచనా. ఈ పనిలో ఇతర జిల్లాకు చెందిన 15 మంది మేస్త్రిలు నిమగ్నమై ఉన్నారు. గతంలో 50 అడుగుల లోతులో బోర్లు వేసి నీటి ఇంజిన్‌ లేదా బావిలో మోటారుతో పంట చేలకు నీరు అందించేవారు. ప్రస్తుతం ఆ లోతులో నీరు అందకపోవటంతో 70 నుంచి 100 అడుగుల లోతు బోర్లు వేయిస్తున్నారు. అంత లోతునుంచి నీటిని తోడేందుకు సబ్‌మెర్సిబుల్‌ నీటి మోటార్లను వినియోగిస్తున్నారు. ఇందుకోసం దాదాపు రూ.లక్షన్నర వ్యయం చేస్తున్నారు. అయితే ఈ పరిణామంతో భూగర్భజలాలు తగ్గిపోవటమే కాదు. కొన్ని ప్రాంతాల్లో నీరు కూడా ఉప్పిరిసిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇప్పటివరకు పంటకాల్వలకు సాగునీటిని సక్రమంగా ఇవ్వలేదు. వెదజల్లిన వరిపైరును ఏదోలా కాపాడుకోవాల్సి ఉంది. రూ.లక్షన్నర వరకు ఖర్చుచేసి బోరు వేయిస్తున్నా. రైతులకు భారం తగ్గించటానికి ప్రభుత్వమే బోర్లు వేయించి, సబ్సిడీపై మోటారు, సామగ్రిని అందించి సహాయం చేయాలి.

– మర్రెడ్డి శివసాంబిరెడ్డి, రైతు

కొల్లిపర ప్రాంత రైతులు పంటపొలాల్లో బోర్లు వేయటానికి ఆసక్తి చూపుతున్నారు. గత రెండు నెలల్నుంచి బోర్లు వేయిస్తున్నారు. ఇందుకోసం 15 మంది మేసీ్త్రలం పనిచేస్తున్నాం. దాదాపు 300 కొత్త బోర్లు వేశాం. పంటను కాపాడుకోవాల్సిన రైతులకు ఇది తప్పని పరిస్థితి అయింది.

– బడుగు సోమేశ్వరరావు,

మేస్త్రి, మద్దూరు, కృష్ణాజిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement