బాపట్ల: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులుగా జీవీవీ రాఘవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం జిల్లా సమావేశం స్థానిక సూర్యకాళి ఫంక్షన్‌న్‌హాలులో ఆదివారం నిర్వహించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులుగా జీవీవీ రాఘవరెడ్డిని ఎన్నుకోవటంతోపాటు కార్యకవర్గాన్ని ప్రకటించారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగ సాయి ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉద్యోగుల సమస్యలపై పోరాటాలు చేసిన ఏకై క సంఘం ఇదేనని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలకు అధికారిగా రాష్ట్ర కార్యదర్శి జి కిషోర్‌కుమార్, పరిశీలకులుగా జి నాగసాయి, అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా సిహెచ్ కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహరించారు. 18 మందితో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్.సూర్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కార్యదర్శి జి.రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వ ఆదేశాలను సంఘ నాయకులు తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
నూతన జిల్లా కమిటీ
జిల్లా అధ్యక్షులుగా జీవీవీ రాఘవరెడ్డి, కార్యదర్శిగా జి రవికుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా మారుతీప్రసాద్, ఉపాధ్యక్షులుగా జె.శ్రీలక్ష్మి, పి తులసీరామ్, కె.వి రమణమ్మ, కే జయరామిరెడ్డి, కే శ్రీనివాసరెడ్డి, సీహెచ్ జనార్దన్‌రెడ్డి, కార్యనిర్వహక కార్యదర్శిగా జి జ్యోతి, సంయుక్త కార్యదర్శిగా నజరీన్, ఎం శ్రీనివాసులు, బి శ్రీకాంత్‌రెడ్డి, పుల్లారావు, రవిచంద్ర, రోశయ్య, పి భానుప్రకాష్, కోశాధికారిగా సందీప్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరికి అతిథులు, తోటి ఉద్యోగులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు.


