రొంపిచర్ల: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో ఆదివారం ఆంధ్రప్రదేశ్ బేస్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు చిరంజీవి, సురేష్, చిన్నరామయ్య, ఎస్‌ఏఏపీ అబ్జర్వర్ పి.నరసింహారెడ్డి, ఆంధ్రప్రదేశ్ బేస్‌బాల్ అబ్జర్వర్ చి.శ్రీనివాసరావు, ఎన్నికల అధికారి రమణారెడ్డి, ముఖ్య అతిథి వై.సైదయ్య పాల్గొన్నారు. ఎన్నికల్లో పి. మణికంఠ వరప్రసాద్ రెడ్డి అధ్యక్షుడిగా, జి.వేమారెడ్డి కార్యదర్శిగా, చి.నాగేంద్రం ఖజాంచీగా, వి.అంజిరెడ్డి ఉపాధ్యక్షుడిగా, పి.కృష్ణారెడ్డి సంయుక్త కార్యదర్శిగా, వి. శివారెడ్డి, ఎ.కమలమ్మ కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు.


