గుంటూరు మెడికల్: వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా లలితనగర్‌లోని లలిత పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో జూన్ 8న అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ పమిడిమక్కల విజయ తెలిపారు. మెదడు కణితుల లక్షణాలు, ట్యూమర్ పరిమాణం, రకం, అది ఉన్న ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయని, తరచూగా తలనొప్పి, మూర్చ రావడం, ఉదయం వేళల్లో వికారం, వాంతులు, చూపు మందగించడం, చేతులు, కాళ్లల్లో బలహీనత, మాట్లాడడంలో ఇబ్బంది, జ్ఞాపక శక్తి తగ్గడం, నడకలో సమతుల్యత కోల్పోవడం, వినికిడి సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. అత్యాధునిక న్యూరో ఇమేజింగ్, ఇమేజ్ గైడెడ్, మినిమల్లి ఇన్వేసీవ్, న్యూరో సర్జరీ, న్యూరో నావిగేషన్, ఇంట్రా ఆపరేటీవ్ ఎమ్మారై, ఎండోస్కోపిక్ బ్రెయిన్ సర్జరీలో నేడు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ బ్రెయిన్ ట్యూమర్లపై అవగాహన పెంపొందించుకుని వ్యాధి బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రివెంటీవ్ మెడిసిన్‌లో భాగంగా తమ హాస్పిటల్‌లో నిర్వహించే అవగాహన సదస్సును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.


