నేటి నుంచి జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు

Jun 7 2026 8:12 AM | Updated on Jun 7 2026 8:12 AM

నేటి నుంచి జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు ఏపీ వ్యవసాయ అధికారుల సంఘం ఆధ్వర్యంలో వైద్య శిబిరం కంతేరులో అర్ధరాత్రి చోరీ తాడికొండ: అర్ధరాత్రి ఓ ఇంటిలో చొరబడి బీరువా పగలగొట్టి రూ.ఏడు లక్షల విలువైన బంగారం, వెండి సామానులు చోరీ చేసిన ఘటన తాడికొండ మండలం కంతేరు గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం కంతేరు గ్రామానికి చెందిన నారపు శెట్టి సూర్యనారాయణ ఈ నెల 01వ తేదీన హైదరాబాద్‌లోని కుమారుడు వద్దకు వెళ్లాడు. 5వ తేదీ తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగలగొట్టి బీరువా తెరచి చెవి రింగ్‌లు, ఉంగరం, లాకెట్‌తో ఉన్న చైన్‌, రెండు గాజులు, ఇతర వెండి వస్తువులు చోరీ చేశారు. వీటి విలువ సుమారు రూ.7 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. చోరీపై సూర్యనారాయణ రెండవ అల్లుడు చక్కా శ్రీనివాసరావు తాడికొండ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ట్రైనీ ఐపీఎస్‌ శిక్షణ పూర్తి

తెనాలి: డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్‌ 5వ జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. నాలుగురోజులపాటు నిర్వహించనున్న పోటీల బ్రోచర్‌ను శనివారం గంగానమ్మపేటలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ఆవిష్కరించారు. నాలుగురోజులపాటు ప్రతిరోజు సాయంత్రం 5.30 గంటల్నుంచి 10.30 గంటల వరకు పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. 7వ తేదీ సాయంత్రం ప్రారంభసభకు ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌, సభాధ్యక్షులుగా అజో విభో కందాళం ఫౌండేషన్‌ ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ పాల్గొంటారని తెలిపారు. ఇదే సభలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవన సాఫల్య పురస్కారాన్ని గుంటూరుకు చెందిన ప్రముఖ రంగస్థల దర్శకులు, నటుడు ఎన్‌.రవీంద్రరెడ్డికి ప్రదానం చేయనున్నారు. తొలిరోజున ఆరు గంటలకు కళాహారతి తరుమాలి వారి ‘ప్రియమైన శత్రువు’ నాటికను ప్రదర్శించనున్నారు. ఉమా రచించిన ఈ నాటికకు నాట్యాచార్య ఎంవీ రమణ దర్శకత్వం వహించారు. సభానంతరం మైత్రి కళానిలయం, విజయవాడ వారి ‘వాస్తవం’ నాటిక ఉంటుంది. స్నిగ్ధ రచించిన ఈ నాటకానికి టీవీ పురుషోత్తం దర్శకత్వంలో ప్రదర్శిస్తారు. రాత్రి 9.15 గంటలకు ఆరాధనా ఆర్ట్స్‌, గుంటూరు వారి ‘సరిగమ పాపా’ నాటికను ప్రదర్శిస్తారు. గోవిందరాజుల నాగేశ్వరరావు రచించిన ఈ నాటికకు నడింపల్లి వెంకటేశ్వరరావు దర్శకత్వం వహిస్తారు. బ్రోచర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పరిషత్‌ అధ్యక్షుడు ఆరాధ్యుల కన్నా, కార్యదర్శి అద్దేపల్లి లక్ష్మణ్‌, కోశాధికారి పిట్టు వెంకట కోటేశ్వరరావు, వైఎస్సార్‌ సీపీ నాయకులు జి.వేణుగోపాలరెడ్డి, అక్కిదాసు కిరణ్‌కుమార్‌, మైలా విజయ్‌నాయుడు, చుక్కా ఆనంద్‌ పాల్గొన్నారు.

కొరిటెపాడు(గుంటూరు): ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ అధికారుల సంఘం (ఏపీ ఏఓ) గుంటూరు, పల్నాడు జిల్లాల సభ్యులు, వారి కుటుంబ సభ్యుల కోసం గుంటూరు కిమ్స్‌– శిఖర హాస్పిటల్‌లో శనివారం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ మనజీర్‌ జిలాని సమూన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మనజీర్‌ జిలానీ సమూన్‌ మాట్లాడుతూ సంఘం సభ్యులు, వారి కుటుంబ సభ్యులకు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. ఈ వైద్య శిబిరంలో ప్రతి వ్యక్తికి 26 అంశాలలో పరీక్షలు నిర్వహించారు. రెండు జిల్లాలకు చెందిన మొత్తం 150 మంది సభ్యులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.బాల భాస్కర్‌, జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ డి.ప్రవీణ్‌, ట్రెజరర్‌ డాక్టర్‌ బి.మురళి కిశోర్‌, సెక్రటరీ డాక్టర్‌ కె.అమల కుమారి, గుంటూరు, పల్నాడు జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

రూ.ఏడు లక్షల విలువైన బంగారం,

వెండి వస్తువులు అపహరణ

నాదెండ్ల: నాదెండ్ల పోలీస్‌స్టేషన్‌లో మూడు నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ ఐపీఎస్‌ జె. నిరంజన్‌ శుక్రవారం రిలీవ్‌ అయ్యారు. ఆయన్ను నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు, రూరల్‌ సీఐ సుబ్బనాయుడు, ఎస్‌ఐలు ఆర్‌.వెంకటేశ్వరరావు, అనిల్‌కుమార్‌, శివరామకృష్ణ సత్కరించారు. డీఎస్పీ మాట్లాడుతూ, పోలీసుల విధి నిర్వహణ కత్తిమీద సాములాంటిదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల సమస్యల పరిష్కారంపై అంకితభావం ఉండాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement