ఆహార భద్రతపై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఆహార భద్రతపై అవగాహన ఉండాలి

Jun 7 2026 8:12 AM | Updated on Jun 7 2026 8:12 AM

గుంటూరు లీగల్‌: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, ఆదేశాల మేరకు శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి, నాలుగో అదనపు సివిల్‌ జడ్జి(సీనియర్‌ డివిజన్‌) సి.రమణా రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలను నివారించటం అనారోగ్యాలను గుర్తించటమని, మనం తినే ఆహారం ఎటువంటి కలుషితం కాకుండా సురక్షితంగా, ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఆహారం విషయంలో ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పర్మినెంట్‌ లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ పి.ఆర్‌. రాజీవ్‌ మాట్లాడుతూ ఆహారపు అలవాట్ల వలన మన దైనందిన జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో వివరించారు. న్యాయ సేవాధికార సంస్థ ఆవరణలో ఫుడ్‌ స్టాల్‌ను ప్రారంభించారు. ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ బి.నరసింహుడు, గవర్నమెంట్‌ ప్లీడర్‌ ఎం.సురేష్‌ బాబు, సి.డబ్ల్యూ.సి. శాఖ శ్రీవాణి, డిస్ట్రిక్ట్‌ సప్లయి ఆఫీసర్‌ కోమలి పద్మ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement