గుంటూరు మెడికల్: ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్(పీఎంఎస్‌ఎంఏ) కార్యక్రమం పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ కె.విజయలక్ష్మి తన ఛాంబర్ నుంచి ప్రోగ్రామ్ అధికారులకు, ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ నెల 8 నుండి నిర్వహించాల్సిన ప్రత్యేక కార్యక్రమం గురించి వివరించారు. ఈనెల 8న గ్రామ/వార్డు స్థాయిలో ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ఎంల ద్వారా ఫ్రీ పీఎంఎస్‌ఎంఏను, 9న వైద్యాధికారులు, స్పెషలిస్ట్ వైద్యులతో ఆరోగ్య కేంద్రాలలో, 10న ఎక్సెండెడ్ పీఎంఎస్‌ఎంఏను సీ్త్ర శిశు సంక్షేమశాఖ, ఇతర శాఖల సహకారంతో పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. 8వ తేదీ ఉండవల్లి, 13వ తేదీ మంగళగిరిలో నిర్వహించే యోగా కార్యక్రమంలో సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆగస్టు నెల చివరి వరకు పొడిగించిన హెచ్‌పీవీ టీకా కార్యక్రమం లక్ష్యాల్లో ప్రగతి సాధించాలని పిలుపునిచ్చారు. ఈనెల 28వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని, ఈనెల నుంచి జరిగే స్టాప్ డయేరియా కార్యక్రమం కోసం తగిన ప్రణాళికలను సిద్ధం చేసికొని విజయవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ అమర్తలూరి శ్రావణబాబు, డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ సుజాత, డాక్టర్ ప్రియాంక, సుబ్బరాయణం, అధికారులు పాల్గొన్నారు.


