గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Apr 1 2026 7:30 AM | Updated on Apr 1 2026 7:30 AM

ఇక గ్రామాల్లోనూ ప్రత్యేక పాలన గుంటూరు వెస్ట్‌: గ్రామ స్వరాజ్యానికి చంద్రబాబు సర్కార్‌ తూట్లు పొడుస్తోంది. జిల్లాలో 16 మండలాలకు సంబంధించి 257 గ్రామ పంచాయతీలున్నాయి. సర్పంచ్‌ల పదవీ కాలం ముగుస్తున్నప్పటికీ చట్టబద్ధంగా నిర్వహించాల్సిన ఎన్నికలను నిర్వహించకుండా ప్రత్యేకాధికారుల (ఎంపీడీఓలు, తహసీల్దార్‌, డిప్యూటీ ఎంపీడీఓ) పాలనకు శ్రీకారం చుట్టనుంది. 2021 ఫిబ్రవరిలో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. ఆనాటి నుంచి గ్రామాల్లో సర్పంచ్‌ల పాలన ప్రారంభమై నేటి వరకు కొనసాగుతోంది. బుధవారం సాయంత్రంతో సర్పంచ్‌ల గడువు ముగియడంతో గురువారం నుంచి ప్రత్యేకాధికారుల పాలన మొదలు కానుంది. దీనికి సంబంధించి జిల్లా పంచాయతీ అధికారులు ఇప్పటికే ఎస్‌ఓల లిస్ట్‌లను సిద్ధం చేశారు. డీపీఓ కార్యాలయం ఈ నెల 15వ తేదీ తర్వాత గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను విడుదల చేయాల్సి ఉంది. దానిపైనా కసరత్తు కొనసాగుతుంది. ఇబ్బందులు తీరేనా? కేంద్రం నుంచి 16వ ఆర్థిక సంఘం నిధులు రావాలంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాల్సిందే. అప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పంచాతీయల ఖాతాల్లోకి జమవ్వదు. సర్పంచ్‌లుంటే వారితోపాటు సరిపడా వార్డ్‌ సభ్యుల కోరం ఉండాలి. ప్రత్యేకాధికారులు ఎవరి అనుమతులు, చర్చలు లేకుండానే పనులు అంగీకరించే అవకావశం ఉంటుంది. సర్పంచ్‌లు నిత్యం గ్రామ ప్రజల మధ్యే ఉంటూ బాగోగులు చూస్తుంటారు. ప్రత్యేకాధికారులు దీనికి కొంచెం భిన్నమనే చెప్పాలి. ప్రజలు వెళ్లి వారిని ఏది కావాలన్నా అడగాల్సిందే.

న్యూస్‌రీల్‌

చేసిన పనులకు బిల్లులు ఏవీ?

2021లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులు అధిక స్థానాల్లో సర్పంచ్‌లుగా గెలిచారు. తర్వాత కొంత అటూ ఇటూ మారినా ఇప్పటికీ వారిదే హవా కొనసాగుతోంది. చంద్రబాబు సర్కార్‌ వచ్చిన తర్వాత పక్షపాత ధోరణితో వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్‌లకు సంబంధించిన బిల్లులను ఆపేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎం–బుక్‌ ( మెజర్‌మెంట్‌ పుస్తకం) ప్రకారం నమోదైన పనులకు బిల్లులు చెల్లించాలని కొందరు సర్పంచ్‌లు డిమాండ్‌ చేస్తున్నారు. గత 10 రోజుల నుంచి ఎటువంటి బిల్లులు చెల్లించవద్దని ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఎవరైనా అప్పటి వరకు పెండింగ్‌ బిల్లులను క్లియర్‌ చేసి ముందుకెళతారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కావాలనే ఆపుతోందనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. అంతేకాదు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన సెస్‌ మొత్తం రూ.లక్షలల్లో పెండింగ్‌లో ఉంది. ఇప్పటి వరకు వాటి విడుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఇలా గ్రామాభివృద్ధిని గాలికి వదిలేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆలయ నిర్మాణానికి విరాళం

బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026
ఇక గ్రామాల్లోనూ ప్రత్యేక పాలన

ఇప్పటికే కొన్ని పంచాయతీల్లో

రూ.లక్షల్లో బిల్లులు పెండింగ్‌

గత పది రోజుల నుంచి బిల్లులు

క్లియర్‌ చేయొద్దని ఆదేశాలు

ఎన్నికలు నిర్వహించకుండా

చంద్రబాబు ప్రభుత్వం దాటవేత ధోరణి

నరసరావుపేట రూరల్‌: ఇస్సపాలెంలోని మహంకాళి ఆలయ నిర్మాణానికి కొనకంచి లక్ష్మయ్య, కుమారి దంపతులు రూ.1.01,116 విరాళంగా అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement