గుంటూరు మెడికల్ : గుంటూరు జీజీహెచ్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉదయభాస్కర్‌ను సీటు నుంచి తొలగిస్తూ ఆఫీస్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డి.ఉయభాస్కర్ కిడ్ని ప్లాంటేషన్ ఆపరేషన్‌లకు దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతులు మంజూరు చేసేందుకు రూ. లక్షకుపైగా అడిగినట్లు జిల్లా కలెక్టర్‌కు బాధితులు లిఖితపూర్వకంగా గత నెలలో ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహదేవ పట్నం గ్రామానికి చెందిన కె.సూర్యనారాయణ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ అనుమతి కోసం జీజీహెచ్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. సదరు సీటు బాధ్యతలు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ ఉదయభాస్కర్ త్వరితగతిన అనుమతులు మంజూరు చేయకుండా నాలుగు నెలలకుపైగా కాలయాపన చేశాడని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి అధికారులు నాలుగు రోజుల క్రితం రహస్య విచారణ చేసి ఉదయభాస్కర్‌పై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు, కనీసం సీటు మార్పు కూడా చేయలేదు. దీనిపై మార్చి 29న ‘సాక్షి’ దినపత్రికలో ‘లంచం ఇస్తేనే ఆపరేషన్’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. సాక్షి కథనంపై ఆసుపత్రి అధికారులు స్పందించి మంగళవారం జూనియర్ అసిస్టెంట్‌ను సీటు మార్పు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నూతక్కి శ్రీకాంత్‌ను కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ బోర్డు నిర్వహించాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.


