దుగ్గిరాల: దుగ్గిరాలలోని పసుపు మార్కెట్ యార్డును తెలంగాణ రాష్ట్రానికి చెందిన కమాలపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ సభ్యులు సోమవారం సందర్శించారు. దుగ్గిరాల పసుపు యార్డు చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, సెక్రెటరీ జె.వి.సుబ్బారావు యార్డు సిబ్బంది వారకి స్వాగతం పలికారు. జెవి సుబ్బారావు మాట్లాడుతూ యార్డులో జరిగే పసుపు వేలం ప్రక్రియ, మార్కెట్ నియంత్రణ పద్ధతులు, రైతులకు అందిస్తున్న సౌకర్యాలు, మౌలిక వసతులు సమగ్రంగా వివరించి తెలియజేశామన్నారు. అనంతరం కమాలపూర్ యార్డు చైర్మన్ ఝాన్సీ రాణి మాట్లాడుతూ దుగ్గిరాల లో తెలుసుకుని అద్యయనం చేసిన ఉత్తమ పద్దతులను తమ మార్కెట్ యార్డునుందు అమలు చేయడానకి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జె.యాకయ్య, పాలకవర్గ సబ్యులు పాల్గొన్నారు.


