సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మహవీర్ జయంతి (మహావీర్ జన్మకల్యాణక్) ఘనంగా నిర్వహించారు. భగవాన్ మహావీర్ చిత్రపటానికి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
‘‘అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనే పంచ మహా వ్రతాలను ప్రజలకు బోధిస్తూ నైతిక జీవనానికి మార్గం చూపిన మహనీయుడు మహావీర్ . ఆ మహర్షి చూపిన మార్గం సదా ఆచరణీయం. నేడు జైనుల ఆధ్యాత్మిక గురువు మహావీర్ జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ సతీష్ రెడ్డి, జైన్ వెల్ఫేర్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మనోజ్ కొఠారి, కుందన్ గాంధీ (సెక్రటరీ, ఎస్‌ఎస్‌ఆర్ జేఎస్‌టీ), ప్రవీణ్ ఫౌలాముతా (కరస్పాండెంట్, ఎస్‌ఎస్‌ఆర్ జేఎస్‌టీ), ప్రవీణ్ కుమార్ జైన్, మనోజ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.

అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనే పంచ మహా వ్రతాలను ప్రజలకు బోధిస్తూ నైతిక జీవనానికి మార్గం చూపిన మహనీయుడు మహావీర్ . ఆ మహర్షి చూపిన మార్గం సదా ఆచరణీయం. నేడు జైనుల ఆధ్యాత్మిక గురువు మహావీర్ జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.#MahavirJayanti pic.twitter.com/2Z5deOnCA1
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 31, 2026


