నల్లపాడు చెరువు కట్టవాసుల వేడుకోలు
గుంటూరు రూరల్: నలభై ఏళ్ళుగా చెరువు కట్టపై నివాసాలు ఏర్పరచుకుని ఉంటున్న తమను ఖాళీ చేయించడం తగదని, జగనన్న ఇచ్చిన ఇళ్ల స్థలాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని, లేదంటే గ్రామంలో స్థలాలు ఇవ్వాలని నల్లపాడు చెరువుకట్టపై నివాసం ఉంటున్న ప్రజలు పేర్కొన్నారు. శనివారం వారితో ఆర్‌డీవో శ్రీనివాసరావు, ఇతర అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువు అభివృద్ధి కోసం ఖాళీ చేయాలని సూచించారు. కూలీనాలీ చేసుకుని బతికే తమకు స్థలాలు కొనుగోలు చేసుకుని ఇళ్లు నిర్మించుకునే శక్తిలేదని చెప్పారు. గతంలో జగనన్న కాలనీలలో కొంత మందికి స్థలాలు కేటాయించారని, అక్కడ సౌకర్యాలు కల్పిస్తే వెళతామని తెలిపారు. గుడిసెలు నిర్మించుకునేందుకు సాయం అందజేయాలని, లేదంటే గ్రామంలోనే ఎక్కడైనా స్థలాన్ని చూపించాలని కోరారు. స్థానిక టీడీపీ నేతలు జులుం ప్రదర్శించారు. యంత్రాలతో ఇళ్లను కూల్చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. అభివృద్ది పేరుతో చెరువులోని మట్టిని విక్రయించుకునేందుకు తయ బతులకును రోడ్డున పడేసస్తున్నారని స్థానికులు ఎదురు తిరిగారు. నోటీసులు త్వరలో ఇస్తామని, ఇదే విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని చెప్పారు.


