లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): చెడు వ్యసనాలకు అలవాటు పడి వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న మైనర్‌ను, యువకుడిని నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 9 ద్విచక్ర వాహనాలు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నగరంపాలెం స్టేషన్‌లో శనివారం వెస్ట్ ఇన్‌చార్జి డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ... నగరంపాలెం స్టేషన్ పరిధిలో వాహనాల చోరీ ఫిర్యాదుల మేరకు సీఐ సత్యనారాయణ కేసు నమోదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఆరా తీసి నిందితులను గుర్తించారు. గుంటూరు ఆటోనగర్‌కు చెందిన మైనర్‌ను నిందితుడిగా తేల్చారు. పల్నాడు జిల్లా పెదరెడ్డిపాలెంకు చెందిన గుర్రపుశాల మణికంట కుమార్ కూడా చోరీలను పాల్పడనట్లు గుర్తించారు. శనివారం ఉదయం గుంటూరులోని వీఐపీ రోడ్డులోని కె.వి.పి. కాలనీ నుంచి చుట్టుగుంట సెంటర్ వైపు వెళ్తున్న సమయంలో వారిని అరెస్టు చేశారు.


