గుంటూరు వెస్ట్ (క్రీడలు): జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరఫున వ్యవహరించేందుకు త్రీమెన్ కమిటీని నియమిస్తూ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సానా సతీష్ శనివారం ఒక ప్రకటన విడుదల చేసారు. కోర్టు వ్యవహారాల నేపథ్యంలో గత ఏడాది కాలం నుంచి త్రీమెన్ కమిటీతోనే నెట్టుకొస్తున్నారు. ఇప్పటి వరకు సభ్యులుగా వ్యవహరించిన యు.మహతి శంకర్, వి.మనోజ్ సాయి, బి.సుధాకర్‌ల పదవీ కాలం ముగిసింది. వారి స్థానాల్లో జి.వి.శరత్ బాబు, నాగరాజు, టి.వెంకట శివ రామకృష్ణలను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. జీడీసీఏ తరఫున అన్ని వ్యవహారాలను ఇకపై నూతన కమిటీ సభ్యులే చూడనున్నారు.


