గుంటూరు
బుధవారం శ్రీ 5 శ్రీ నవంబర్ శ్రీ 2025 గుంటూరు మెడికల్: జిల్లాలో జ్వరాల కేసులు ప్రతిరోజూ నమోదవుతున్నాయి. గుంటూరు జీజీహెచ్‌లో పలువురు చికిత్స కోసం వస్తున్నారు. పలు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా చికిత్స కోసం వస్తున్న వారి సంఖ్య రోజూ పెరుగుతూనే ఉంది. పెద్దవారే కాకుండా పిల్లలు సైతం విష జ్వరాల బారిన పడటంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వైరల్ ఫీవర్స్‌తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బాధితుల లెక్కలు కూడా రికార్డుల్లో నమోదు కావటం లేదు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటిదాకా 750 మంది టైఫాయిడ్, ఐదుగురు మలేరియా, 88మంది డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం తదితర వ్యాధులు వచ్చాక ఆస్పత్రుల చుట్టూ తిరిగి ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకోవటం కంటే ముందుస్తుగా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. శారీరక శుభ్రతతో పాటు ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం ద్వారా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
వర్షాలు వస్తే వ్యాధుల సీజన్ ప్రారంభమైనట్లే. జిల్లాలో కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తూ ఉండటంతో ఏదో ఒక ప్రాంతంలో ఎక్కువుగా జ్వరాల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. సీజనల్ వ్యాధులపై అవగాహన పెంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి ఢోకా ఉండదు. లేకపోతే అనారోగ్యం బారిన పడక తప్పదు. వర్షాలు కురిసేటప్పుడు దోమలు బాగా పెరిగి వ్యాధులను కలుగజేస్తాయి. దోమ చిన్నదే కాని దాని కాటు వల్ల వచ్చే వ్యాధులు మాత్రం ఎక్కువ. డెంగీ, చికెన్‌గున్యా, మలేరియా, ఫైలేరియా, మెదడువాపు తదితర వ్యాధులన్నీ దోమలు కుట్టడం ద్వారానే వస్తాయి. వర్షా కాలంలో వ్యాధులన్నీ కూడా దోమకాటు వల్లే వస్తుంటాయి.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో మరణాలకు ఇప్పటికీ సరైన కారణాలు తేలలేదు. మెలియాయిడోసిస్ వల్ల కొందరు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. వర్షాకాలంలో ప్రబలే ఈ వ్యాధి సోకిన వారిలో అధిక జ్వరం ఉంటుంది. బరువు తగ్గటం లేదా పెరగటం, రాత్రి వేళలో ఒళ్లంతా బాగా చెమటలు పడతాయి. దీర్ఘకాలంగా దగ్గు ఉంటుంది. దగ్గితే రక్తం పడుతుంది. కడుపు నొప్పి, ఛాతీ నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పి, తలనొప్పి, మూర్ఛలు ఉంటాయి.
న్యూస్‌రీల్
వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రతలు
దోమల నియంత్రణ కోసం ఇంటి లోపల, బయటా నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి.
ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలి.
ఇంటి ఆవరణలో ఖాళీ కొబ్బరి చిప్పలు, కొబ్బరి బొండాలు , పాత టైర్లు, రోళ్లలో నీటి నిల్వలు లేకుండా చూడాలి.
ఎయిర్ కూలర్‌లలో, పూల కుండీలలో నీటిని మూడు రోజులకు ఒకసారి మార్చాలి.
ఓవర్‌హెడ్ ట్యాంక్‌లకు మూతలు బిగించాలి.
వారానికి ఒకసారి నీటి గుంటల్లో కిరోసిన్, మడ్డి ఆయిల్ చల్లించాలి.
ఉదయం, సాయంత్రం వేళల్లో కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి.
దోమ తెరలు తప్పనిసరిగా వాడాలి.
ప్రాతః కాల అభిషేకాలు
ఆలయానికి విరాళం
పులిచింతల సమాచారం
బుధవారం శ్రీ 5 శ్రీ నవంబర్ శ్రీ 2025
9
వర్షాలతో వ్యాధులు ప్రారంభం
భయపెడుతున్న మెలియాయిడోసిస్
భట్టిప్రోలు: పెదపులివర్రులోని శ్రీ రాజరాజ నరేంద్రస్వామి వారికి మంగళవారం 14వ పర్వదినాన ప్రాతః కాలంలో అభిషేకాలు నిర్వహించారు.
దుగ్గిరాల: కంఠంరాజు కొండూరులోని మహంకాళీ అమ్మవారి ఆలయానికి మంచికలపూడికి చెందిన యార్లగడ్డ వెంకటేశ్వరరావు కుమారుడు రూ.లక్ష విరాళం అందించారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 54,483 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 44,533 క్యూసెక్కులు వదులుతున్నారు.
గుంటూరు రూరల్ మండలానికి చెందిన పదో తరగతి విద్యార్థిని గత నెల 16న జ్వరంతో చికిత్స పొందుతూ గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మరణించింది. ప్రతి రోజూ స్కూల్‌కు వెళ్తూ ఆడుతూ పాడుతూ ఉంటే బిడ్డ కళ్లెదుటే చనిపోవటాన్ని ఆ కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారు. గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించినా మరణించడంతో షాక్‌కు గురయ్యారు. జ్వరం రాగానే ఆశ్రద్ధ చేయకుండా తక్షణమే అర్హత ఉన్న వైద్యులను సంప్రదించాలి. త్వరితగతిన వ్యాధి నిర్ధారణ చేయించి చికిత్స అందించడం వల్ల మరణాలను ఆపవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
1/8
గుంటూరు
2/8
గుంటూరు
3/8
గుంటూరు
4/8
గుంటూరు
5/8
గుంటూరు
6/8
గుంటూరు
7/8
గుంటూరు
8/8
గుంటూరు