
విద్యుత్ సేవల్లో నాణ్యత ముఖ్యం
గుంటూరు వెస్ట్: జిల్లాలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ యూనిట్లు ఏర్పాటు వేగవంతం చేయాలన్నారు, ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రజల భాగస్వామ్యం కీలకం
గుంటూరు జిల్లాను క్లీన్, గ్రీన్‌గా మార్చడానికి ప్రజల భాగస్వామ్యం కీలకం అని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా కోర్టు కాంపౌండ్ వద్ద జీఎంసీ ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో క్లీన్ ఎయిర్ అంశంపై నిర్వహించిన ర్యాలీని కలెక్టర్‌తోపాటు జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యే గళ్లా మాధవి, నగర మేయర్ కొవెలమూడి రవీంద్ర బాబులు ప్రారంభించారు. నగరంలో వాయు కాలుష్యం తగ్గించేలా ఈ సీజన్‌లో 5 లక్షల మొక్కలు నాటడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌ఎస్‌కే ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ చక్రవర్తి, డీటీసీ సీతారామిరెడ్డి, డీప్యూటీ డీఎంహెచ్‌ఓ సువర్ణబాబు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా