వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ కార్యదర్శి పొలూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో మీడియా నాలుగో స్తంభం అని పేర్కొన్నారు. వార్తలు రాసేందుకు సోర్సు ఎలా వచ్చిందని పత్రికలను అడగడం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా చేయలేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రత్యేకంగా ‘సాక్షి’ని లక్ష్యంగా చేసుకుందని అన్నారు. ఏ వార్త రాసినా తప్పే అన్నట్టుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి హైదరాబాద్‌లో ఉంటే ఇంటికి వెళ్లి కుట్రపూరితంగా నోటీసులు జారీ చేశారని ధ్వజమెత్తారు. ఆయన్ను మానసికంగా వేధించాలనే కుట్రకు తెరలేపారని అన్నారు. ఏపీ అంతటా సాక్షి మీడియాపై, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై కూడా ఇలాంటి దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రజా సంఘాలు ఈ విషయంలో పాత్రికేయులకు మద్దతుగా ఉంటాయని ప్రకటించారు.