
ఆంధ్ర గాంధీ వావిలాల ఆదర్శప్రాయుడు
సత్తెనపల్లి: ఆంధ్ర గాంధీగా పేరు తెచ్చుకున్న స్వాతంత్య్ర సమరయోధులు, సత్తెనపల్లి మాజీ శాసనసభ్యులు వావిలాల గోపాలకృష్ణయ్య ఆదర్శప్రాయుడని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని వావిలాల స్మృతివనంలో బుధవారం నిర్వహించిన వావిలాల గోపాలకృష్ణయ్య 119వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మద్యపాన నిషేధం కోసం వావిలాల ఎన్నో పోరాటాలు చేశారన్నారు. సత్తెనపల్లి శాసనసభ్యుడిగా వరుసగా 1952 నుంచి 1967 వరకు నాలుగు ఎన్నికల్లో గెలుపొంది 20 ఏళ్ల పాటు పని చేశారన్నారు. డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి మాట్లాడుతూ వావిలాల గోపాలకృష్ణయ్య జీవితం అందరికీ ఆదర్శం కావాలన్నారు. ముందుగా వావిలాల గోపాలకృష్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వావిలాల గోపాల కృష్ణయ్య మనవడు మన్నవ సోడేకర్, గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, వైఎస్సార్ సీపీ నాయకులు పక్కాల సూరిబాబు, షేక్ నాగుల్‌మీరా, షేక్ మౌలాలి, రాయపాటి పురుషోత్తమరావు, పంచుమర్తి అప్పారావు, కళ్ళం విజయభాస్కర్‌రెడ్డి, అచ్యుత శివ ప్రసాద్ తదితరులు ఉన్నారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు