
తురకపాలెంలో కలెక్టర్ పర్యటన
గుంటూరు జీజీహెచ్‌లో డయేరియా బాధితుల కోసం జనరల్ సర్జరీ డిపార్టుమెంట్‌లో 333 గదిని ఏర్పాటు చేశారు. మూడు రోజులుగా డయేరియా బాధితులు ఆసుపత్రికి వస్తున్నారు. తొలుత జనరల్ మెడిసిన్ విభాగంలో చికిత్స అందించారు. రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరిగిపోవడం, వ్యాధి తీవ్రత పెరిగిపోవడంతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.
నగరంలో పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల నీరు నిల్వ ఉండి తద్వారా వ్యాధులు ప్రబలుతున్నాయి. పారుదల లేక మురుగు కాల్వలు కూడా రోడ్లపై పొంగుతున్నాయి. వ్యాధులు కలుగచేసే కీటకాలు, బ్యాక్టీరియా పెరిగి వ్యాధులకు కారణమవుతున్నాయి. కార్పొరేషన్ అధికారులు మురుగునీటి నిల్వలను సకాలంలో తొలగించేందుకు ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు. అందువల్లే వ్యాధులు ప్రబలుతున్నాయనే ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
రోడ్డు పక్కన ఆహార పదార్థాల విక్రయం
నగరంలో పలువురు వ్యాపారులు మురుగు కాల్వల పక్కన, తోపుడుబండ్లపై అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారు. వీటి ద్వారా కూడా డయేరియా ప్రబలుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో అపరిశుభ్ర వాతావరణంలో ఆహార విక్రయాలు చేసేవారిపై ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోతున్నాయి. పానీపూరి బళ్ల వద్ద ఎక్కువ మంది ప్రజలు వాటిని తిని రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. పానీపూరి తినడం వల్ల డయేరియా ప్రబలుతున్నట్లు వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు.
వర్షం నీటి నిల్వతో వ్యాధులు