
పాత్రికేయులకు రక్షణ కల్పించాలి
రాష్ట్ర ప్రజల గొంతు నొక్కినట్లే..
ప్రజాస్వామ్యానికి పెను ముప్పు
వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడం జర్నలిస్టుల హక్కు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత్రికేయులపై దాడులు చేయించడం దారుణం. జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయింది. సాక్షి ఎడిటర్, విలేకరులపై కేసులు నమోదు చేయడం దుర్మార్గం. సాక్షిని టార్గెట్ చేయడం అన్యాయం. ప్రతి జర్నలిస్టుకు కూటమి ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాలి.
– వరికూటి అశోక్‌బాబు, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త
సమాజంలో జరుగుతున్న అన్యాయాలను వెలికి తీసి వాటిపై ప్రశ్నించే హక్కు మీడియాకు, పత్రికా ప్రతినిధులకు ఎల్లప్పుడూ ఉంటుంది. అటువంటి వారి హక్కులను అణగదొక్కేలా ప్రభుత్వాలు వ్యవహరించటం దుర్మార్గమైన చర్య. జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలపై మీడియాలో వార్తలు ఇస్తే వారిపై కక్షపూరితంగా మండల రిపోర్టర్ దగ్గర నుంచి చివరకు ఎడిటర్ వరకు కూడా అక్రమ కేసులు బనాయించటం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఇప్పటికై నా మీడియా ప్రతినిధులపై, సంస్థలపై కక్షపూరితంగా వ్యవహరించడం మానుకోవాలి. వారు ఎత్తిచూపిన లోపాలను సరిచేసుకుని ముందుకు సాగాలి.
– డాక్టర్ ఈవూరి గణేష్, వైఎస్సార్‌సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త
కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలపై సాక్షి దినపత్రికలో ప్రచురించారని పోలీసులు కేసులు నమోదు చేయడం తగదు. సాక్షి ఎడిటర్, విలేకరులను నిందితులుగా చూపడం హాస్యాస్పదం. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పత్రికలపై కేసులు పెట్టి వేధించడం దారుణం. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ హరించేలా కేసులు నమోదు చేయడం పెనుముప్పుకు సంకేతం. పాత్రికేయులకు తగిన స్వేచ్ఛ ఇవ్వాలి. లేకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.
– నంబూరు శంకరరావు, మాజీ ఎమ్మెల్యే, పెదకూరపాడు

పాత్రికేయులకు రక్షణ కల్పించాలి

పాత్రికేయులకు రక్షణ కల్పించాలి

పాత్రికేయులకు రక్షణ కల్పించాలి