
బార్‌లా తెరిచినా రాం..రాం !
దరఖాస్తు చేసేందుకు వ్యాపారులు విముఖత బార్ నిర్వహణ భారం ఎక్కువగా ఉండటంతో నిరాస్తకత వైన్ షాపులకు పర్మిట్ రూములు ఇవ్వడంతో దూరం మద్యం బాటిళ్లపై మార్జిన్ కూడా లేకపోవడం కారణం
గత ప్రభుత్వంలో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 67 బార్లు ఉండేవి. ఒక్కోదానికి లైసెన్స్ ఫీజు రూ.55లక్షలు ఉండేది. నాన్‌న్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజు రూ.10లక్షలు ఉండేది. మొత్తం రూ. 65 లక్షలతో గుంటూరు నగరంలో బార్ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు నూతన పాలసీలో ప్రభుత్వం గుంటూరు జిల్లాలో 110 బార్‌లకు నోటిఫికేషన్ ఇచ్చింది. వీటికి అదనంగా కల్లుగీత కులాలకు 10 బార్లు కేటాయించింది.
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 73 బార్లుతో పాటు అదనంగా కల్లుగీత కార్మికులకు ఆరు బార్లు కేటాయించారు. ఒక్కో బార్‌కు రూ.75లక్షలు లైసెన్స్ ఫీజు, రూ.5లక్షలు దర ఖాస్తు ఫీజు, రూ.10వేలు ఎన్‌రోల్ ఫీజు పెట్టారు.
కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ తీస్తామని ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. మొత్తం నాలుగు దరఖాస్తులకు రూ. 5 లక్షల చొప్పున రూ.20లక్షలు అవుతుంది. ఈ లెక్కన ఒక బార్‌కి లైసెన్స్ ఫీజుగా రూ.95లక్షలకు పైనే చెల్లించాల్సి వస్తోంది.
వైన్ షాపులకు ఇచ్చే మార్జిన్ బార్ షాపులకు లేదు.
ప్రస్తుత పాలసీలో వైన్‌న్ షాపులతో పాటే బార్‌కు మద్యం బాటిళ్లు మార్జిన్ ఇస్తారు. సరుకు అమ్ముకున్న తరువాత మార్జిన్ అమౌంట్ తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలి.
సాక్షి పత్రినిధి, గుంటూరు/ నెహ్రూనగర్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీతో వ్యాపారస్తులు బార్ షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే గడువు ఉన్నప్పటికీ ఇంత వరకు ఒక్క దరఖాస్తు కూడా అందలేదు. ఒక్కరు కూడా లైసెన్స్ ఫీజు చెల్లించకపోవడం చూస్తుంటే దూరంగా ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. దీంతో ఎకై ్సజ్ అధికారులు కిందా మీద పడుతున్నారు. ఎలాగైనా దరఖాస్తులు వచ్చేలా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలతో మంతనాలకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
పర్మిట్ రూములతో మరింత నష్టం
గుంటూరు జిల్లాలో 140 వైన్ షాపులు ఉన్నాయి. వీటికి వచ్చే నెల 1వ తేదీ నుంచి పర్మిట్ రూములు మంజూరు చేయడంతో ఇక బార్‌లో ఎవరూ మద్యం తాగరని లైసెన్సీలు ఒకింత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో గంట పెంచారు. రాత్రి 11 దాటితే మద్యం తాగే వారు తక్కువగా వస్తారని, సమయం పెంచినా ఎవరికీ ఉపయోగం ఉండదని లైసెన్సీలు వాపోతున్నారు. బార్‌లో గతంలో చీప్ లిక్కర్ అమ్మకాలు జరిగేవి. ఇప్పుడు చీప్ లిక్కర్(రూ.99) ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో దరఖాస్తు చేసుకునేందుకు ముందకు రాని పరిస్థితి. ఆదివారానికి 70 మంది మాత్రమే దరఖాస్తుకు ఎనన్‌రోల్ చేసుకున్నారు. అంటే గుంటూరు జిల్లాలో 120 బార్లు ఉంటే, ఒక్కో బార్‌కు ఒక్క దరఖాస్తు కూడా రాని పరిస్థితి నెలకొంది.
అధికారుల వేడుకోలు
కొత్త మద్యం పాలసీలో మంచి లాభాలు వస్తాయని ఎకై ్సజ్ అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు చేసుకోవాలంటూ వ్యాపారస్తులు, లైసెన్సీలను, రియల్‌ఎస్టేల్, పారిశ్రామిక వేత్తలను వేడుకుంటున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మద్యం అమ్ముకునే అవకాశం ఉందని, మూడేళ్లు వ్యాపారం లాభసాటిగా ఉంటుందని చెబుతున్నారు. బార్ షాపునకు దరఖాస్తు చేసుకునే వారికి ఐటీ మినహాయింపు ఇచ్చిందని, నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించినప్పటికీ దరఖాస్తులు రాని పరిస్థితి నెలకొంది. మద్యం పాలసీపై మరిన్ని సడలింపులు ఇవ్వాలని ప్రభుత్వం బార్ నిర్వాహకులు కోరుతున్నారు.
కొత్త పాలసీతో మరింత నష్టాలు?