
తరంగ గానానికే సంపత్ జీవితం అంకితం
అద్దంకి: తరంగ గానానికే శ్రీకృష్ణ సంపత్‌కుమార్ జీవితం అంకితమైందని విశ్లేషకుడు వారణాసి రఘురామశర్మ పేర్కొన్నారు. తరంగ గాన లోకంలో అపూర్వమైన ప్రతిభను ప్రదర్శిస్తున్న ఘోరకవి శ్రీకృష్ణ సంపత్ కుమార్‌కు పుట్టంరాజు బుల్లెయ్య, రామ లక్ష్మమ్మల విస్తృత కళా పురస్కారం అందజేశారు. పురస్కార ప్రదాన కార్యక్రమం స్థానిక పుట్టంరాజు కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించారు. పద్య కవి డీవీఎం సత్యనారాయణ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. చప్పిడి వీరయ్య సభాహ్వానం పలికారు. పురస్కార గ్రహీత సంపత్ కుమార్ గురించి వారణాసి రఘురామశర్మ సభకు పరిచయం చేశారు. సంపత్ తరంగ గానంలో జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడిగా సత్యనారాయణ అభివర్ణించారు. శింగరకొండ నరసింహక్షేత్రం, నారాయణ తీర్థుల వారికి గల సంబంధాన్ని పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి వివరించారు. పోలూరి వెంకట శివరామ ప్రసాద్ శ్రీకష్ణలీలా తరంగిణి వైభవాన్ని విశ్లేషిస్తూ ఉపన్యసించారు. ఎన్వీఎల్ హనుమంతరావు, నారాయణ బాలసుబ్రహ్మణ్యం, యూవీ రత్నం తదితరులు సంపత్ తరంగ సేవలను ప్రశంసించారు. పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, శైలజ దంపతులు ఘోరకవిని సత్కరించారు. కార్యక్రమంలో కార్యదర్శి కేవీ పోలిరెడ్డి, కోశాధికారి చుండూరి మురళీ సుధాకరరావు, నిమ్మరాజు నాగేశ్వరరావు, యు. దేవపాలన, జి.దివాకరదత్తు, మోటుపల్లి రామదాసు, మలాది శ్రీనివాసరావు, షేక్ మస్తాన్, కూరపాటి రామకోటేశ్వరరావు, ఆర్టిస్టు బాలు, శ్రీమన్నారాయణ, మక్కెన వెంకటేశ్వర్లు, పి.అంకయ్య తదితరులు పాల్గొన్నారు.
విశ్లేషకుడు వారణాసి రఘురామశర్మ
ఘోరకవి శ్రీకృష్ణ సంపత్‌కుమార్‌కు పురస్కారం ప్రదానం

తరంగ గానానికే సంపత్ జీవితం అంకితం