
నేడు గవర్నర్ రాక
విజ్ఞాన్ వర్సిటీలో ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
చేబ్రోలు: రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్శిటీలో శనివారం జరిగే స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. దీని దృష్ట్యా అక్కడ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ శుక్రవారం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీసు బందోబస్తు, గవర్నర్ రోడ్డు మార్గంలో వచ్చే ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, రూట్ బందోబస్తు ఏర్పాట్లపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. తెనాలి డీఎస్పీ బి జనార్ధన్, ఏఆర్ డీఎస్‌పీ డి.ఏడుకొండలు, పొన్నూరు రూరల్ సీఐ వై. కోటేశ్వరరావు, చేబ్రోలు ఎస్‌ఐ డి. వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సీకే కన్వెన్షన్‌లో ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
మంగళగిరి : మండలంలోని ఆత్మకూరు జాతీయరహదారి వెంట ఉన్న సీకే కన్వెన్షన్‌లో శనివారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్న కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, ఎస్పీ సతీష్‌కుమార్, సంయుక్త కలెక్టర్ భార్గవతేజలు శుక్రవారం పరిశీలించారు. పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వాహనాల పార్కింగ్ సభావేదిక పై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ టి.పార్వతీశం, ఆర్డీవో కె. శ్రీనివాసరావు, డిఎస్పీలు మురళీకృష్ణ, ఎం.రాము, డీటీసీ కె. సీతారామిరెడ్డి, ఫైర్ ఆఫీసర్ వై. వెంకటేశ్వర్లు, తహసీల్దార్ కె. దినేష్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

నేడు గవర్నర్ రాక