
సాహితీ రెడ్డి ట్రస్ట్ సేవలు అభినందనీయం
ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి
నెహ్రూనగర్: పేద విద్యార్థుల అభ్యున్నతికి బండి సాహితీ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి కొనియాడారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంపాలెంలోని రెడ్డి హాస్టల్‌లో బుధవారం 70 మంది పేద విద్యార్థులకు రూ.5వేలు చొప్పున ఆర్థిక సాయం, కొండవీడు మ్యూజియం అభివృద్ధికి రూ.5లక్షలు, మిర్చి యార్డు కార్మికుల సంక్షేమ నిధికి రూ.50వేలను ట్రస్ట్ నిర్వాహకులు బండి అశోక్ రెడ్డి, సుధారాణి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులంతా దాతల సహకారాలు అందిపుచ్చుకుని ముందుకు సాగాలని సూచించారు. యువత సోషల్ మీడియా, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ భవిష్యత్తుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని సూచించారు. కార్యక్రమంలో ఆంధ్ర లయోలా కాలేజీ రిటైర్డ్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గుమ్మా సాంబశివరావు, ఏపీటీపీఐఈఏ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం.వి.బ్రహ్మానందరెడ్డి, వైకేఆర్ స్కాలర్‌షిప్ ఛైర్మన్ ఏరువా సాయిరామ్, రిటైర్డ్ ఆర్జేడీ డాక్టర్ ఐకేవీ ప్రసాద్, రెడ్డి హాస్టల్ ప్రెసిడెంట్ చల్లా అంజిరెడ్డి, సెక్రటరీ కంది సంజీవరెడ్డి, ఉపాధ్యక్షులు సూరసాని వెంకటరెడ్డి, మేనేజర్ జంగా సత్యనారాయణరెడ్డి, కార్పొరేటర్లు అచ్చాల వెంకటరెడ్డి, పడాల సుబ్బారెడ్డి, ఉడుముల లక్ష్మి పాల్గొన్నారు.