
జిల్లాలో 10 లక్షల మంది
గుంటూరు జిల్లాలో ప్రతిరోజూ లక్ష మందికిపైగా ఆర్టీసీ ద్వారా ప్రయాణం చేస్తున్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అందులో 50 శాతం పైగా మహిళలు ఉండటం విశేషం. గుంటూరు కేంద్రంగా నిత్యం అనేక ప్రాంతాలకు ఉద్యోగినులు, ఆయా పనులు చేసుకునేవారు, వ్యాపారం చేసే మహిళలు నిత్యం ప్రయాణిస్తుంటారు. విద్యార్థులు, ఉద్యోగాలు చేసుకునే యువతులు కూడా అధికంగానే ఉన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మహిళలు 1.50లక్షల మంది ఉన్నారు. గుంటూరు పశ్చిమ 1.30లక్షలు, తెనాలి 1.41లక్షలు, పొన్నూరు 1.15లక్షలు, తాడికొండ 1.60లక్షలు, మంగళగిరి 2.03లక్షలు, ప్రత్తిపాడు నియోజకవర్గంలో 1.45లక్షల మందికిపైగా ఉన్నారని గణంకాలు చెబుతున్నాయి. సుమారుగా జిల్లాలో 10 లక్షలకుపైగా మహిళలు ఉన్నారు.