
పోలీసుల అదుపులో మద్యం అమ్మకందారులు
తాడికొండ: ‘మద్యం మత్తులో యువకుల ఘర్షణ’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి పోలీసులు స్పందించారు. తాడికొండలోని మద్యం దుకాణంలో రాత్రి వేళ అమ్మకాలు చేస్తున్న వ్యక్తిని సోమవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి దాదాపు 80కి పైగా మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే 49 మద్యం సీసాలు మాత్రమే పట్టుకున్నట్లు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంతా జరుగుతున్నా పోలీసులు స్పందించారే తప్ప ఎకై ్సజ్ అధికారులు అటుగా తొంగి చూడకపోవడం విశేషం.
80కి పైగా మద్యం బాటిళ్లు దొరికినట్లు సమాచారం
49 సీసాల మద్యం పట్టుకున్నట్లు
కేసు నమోదు చేసిన పోలీసులు