మాయదారి జూదం | - | Sakshi
Sakshi News home page

మాయదారి జూదం

Jul 28 2025 8:17 AM | Updated on Jul 28 2025 8:17 AM

మాయదా

మాయదారి జూదం

జోరుగా

● నల్లచెరువు ప్రాంతంలో మూడుబొమ్మల సెంటర్‌ వద్ద, లాలాపేట పూలకొట్ల వద్ద దందా సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఆటోల్లో కూర్చుని చీటీలు రాసి కార్మికులు ఇస్తున్న వీడియో కూడా ఇటీవల కాలంలో వైరల్‌గా మారింది. ఈ స్టేషన్‌ పరిధిలో మఫ్టీ, క్రైమ్‌ పార్టీ కానిస్టేబుళ్లు వసూళ్లు చేస్తున్నారనే వాదనలు వినవస్తున్నాయి.

● నెహ్రునగర్‌ ప్రాంతంలో కూడా సాగుతోందనే తెలుస్తోంది. ఇక్కడ స్పష్టంగా సాగుతోందని తెలిసినప్పటీకీ పోలీసులు పట్టించుకోవడం లేదు. స్టేషన్‌ అధికారి పనులు చక్కబెట్టే ఇద్దరు కానిస్టేబుళ్లు వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. గత వైఎస్సార్‌ సీపీ హయాంలో నిలిపి వేసిన వ్యక్తులే తిరిగి మొదలుపెట్టారనేది జగమెరిగిన సత్యం.

పట్నంబజారు: నగరంలో సింగిల్‌ నంబర్‌ లాటరీ నిర్వహణ మళ్లీ తారస్థాయికి చేరుకుంది. చీటీలు రాసి.. కార్మికులు, కూలీనాలీ చేసుకునే ప్రాంతాల్లో అధికంగా ఆటను నిర్వహిస్తున్నారు. వీటితో పాటుగా ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా పేదలను దోచుకుంటున్నారు. చీటీలు రాసిన తరువాత.. ఆ నంబర్‌ తగిలితే.. సాయంత్రానికి ఆ మొత్తానికి తిరిగి ఏడింతలు తిరిగి ఇస్తారు. రూ. 100 కడితే, రూ. 800 వస్తాయి. ఈ ఆశతో కార్మికులు వారు పడ్డ కష్టాన్ని లాటరీ రూపంలో తగలేస్తున్నారు. ఒట్టి చేతులతో ఇంటికి వెళుతూ కుటుంబాన్ని పస్తులు పెడుతున్నారు.

జోరుగా టికెట్ల అమ్మకాలు

నగరంలో సింగిల్‌ నంబర్‌ లాటరీ టికెట్‌ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. నంబర్‌ తగులుతుందనే ఆశతో వేలాది రూపాయలు పెట్టి అమాయకులు కొని మోసపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనూ సింగిల్‌ నంబర్‌ లాటరీ యాప్‌లు జోరుగా నడుస్తున్నాయి.వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుని, అందులో పలు ప్రాంతాల నుంచి వచ్చే లింకులు ఆధారంగా ఆటలు ఆడిస్తున్నారు. చక్కా..మక్కా, బోడోలాండ్‌, సూపర్‌ చక్కర్‌, మట్కా కింగ్‌, సూపర్‌ రైడర్‌, ది ఫాక్స్‌, క్యాసినో కింగ్‌, గ్యాంబ్లిగ్‌ బాబాతో పాటు అనేక రకాల యాప్‌లు ఆన్‌లైన్‌లో నడుస్తున్నాయి. వాటిల్లో కూలీలు, కార్మికులు, ఆటోవాలాలు లాటరీ తగులుతుందనే ఆశతో వేలాది రూపాయాలు వెచ్చించి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. సింగిల్‌ నంబర్‌ నిర్వాహకులు మేనేజర్‌లను పెట్టుకుని మరీ స్లిప్పులు రాయిస్తున్నారు.

ఒక్కొక్క నిర్వాహకుడి కింద 10 మంది మేనేజర్లు ఉంటున్నారంటే నగరంలో పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

నడిరోడ్డు పైనే నిర్వహణ

నగరంలోని అనేక ప్రాంతాల్లో సింగిల్‌ నంబర్‌ లాటరీ రోడ్ల పైనే గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. నిర్వాహకులు ఆటోల్లో కూర్చుని గుట్టుచప్పుడు కాకుండా చీటీలు కట్టిస్తున్నారు. ముఖ్యంగా పాత గుంటూరులో కూర్చుని ఉన్న గాంధీబొమ్మ సెంటర్‌ వద్ద, ఆర్టీసీ కాలనీ, పొన్నూరు రోడ్డులో కొంత మంది వ్యక్తులు ఆడిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇటీవలే కూటమి చెందిన ఒక కార్పొరేటర్‌ స్టేషన్‌ అధికారులతో మాట్లాడి.. నెలవారీ ఒప్పొందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇదే కార్పొరేటర్‌ పాత గుంటూరు ప్రాంతంలో యథేచ్ఛగా పేకాట కూడా నేరుగా తానే అడిస్తున్నారని చెప్పుకుంటున్నారు. అతడి నుంచి సదరు స్టేషన్‌ అధికారి వద్ద డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

యథేచ్ఛగా సింగిల్‌ నంబర్‌ లాటరీ కూటమి నేతల కనుసన్నల్లో నిర్వహణ పేదలకు ఆశ చూపి.. రక్తం పీలుస్తున్న నిర్వాహకులు కార్మికులు, కూలీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే నిర్వహణ ప్రతి స్టేషన్‌కు మామూళ్లు ఇస్తున్న లాటరీ నిర్వాహకులు

చర్యలు తీసుకుంటాం

సింగిల్‌ నంబర్‌ లాటరీ నిర్వాహకులపై దృష్టి సారించి చర్యలు తీసుకుంటాం. ఇప్పటీకే నందివెలుగు రోడ్డులోని కూర్చుని ఉన్న గాంధీబొమ్మ దగ్గర సింగల్‌ లాటరీ జరుగుతున్నట్లు తెలిసింది. వెంటనే ఆపాలని సంబంధిత పాత గుంటూరు ఎస్‌హెచ్‌వోను ఆదేశించాం. అయినప్పటీకీ ఆగకపోతే చర్యలు తీసుకుంటాం. నల్లచెరువు, నెహ్రూనగర్‌ ప్రాంతాల్లో కూడా దృష్టి సారించి సింగిల్‌ నంబర్‌ లాటరీ ఆడే వారిపై కేసులు నమోదు చేస్తాం.

–షేక్‌ అబ్దుల్‌ అజీజ్‌ (డీఎస్పీ, గుంటూరు ఈస్ట్‌)

మాయదారి జూదం 
1
1/1

మాయదారి జూదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement