మద్యం మత్తులో యువకుల ఘర్షణ | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో యువకుల ఘర్షణ

Jul 28 2025 8:07 AM | Updated on Jul 28 2025 8:07 AM

మద్యం

మద్యం మత్తులో యువకుల ఘర్షణ

తాడికొండ: మద్యం మత్తులో రెండు సామాజిక వర్గాలకు చెందిన యువకులు పరస్పర దాడులకు దిగారు. ఇందులో ఒక యువకుడికి తల పగిలిన ఘటన తాడికొండలో ఆదివారం జరిగింది. వివరాల ప్రకారం.. తాడికొండ శివారు పెదపరిమి రోడ్డులోని వైన్స్‌ దుకాణం వద్ద మద్యం తాగిన ముస్లిం యువకులు, పక్కనే ఉన్న దుకాణం వద్దకు వెళ్లి బూతులు మాట్లాడుకుంటుండగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకులు వారించారు. దీంతో వివాదం చెలరేగి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇది కాస్తా పెద్దదిగా మారింది. ముస్లిం యువకులు గాంధీబొమ్మ సెంటర్‌ వద్ద అటుగా వస్తున్న యువకులను టార్గెట్‌ చేసి వివాదానికి దిగడంతో, గొడవ పెద్దదిగా మారింది. వివాదానికి సంబంధం లేని నూతక్కి సాగర్‌బాబు అటుగా వస్తూ ఆగి చూస్తుండగా రాడ్డుతో తలపై కొట్టడంతో పగిలి రక్తస్రావమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. బాధితుడిని వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. ఘటన స్థలంలో సీసీ పుటేజీలను సీఐ కె. వాసు పరిశీలించారు. దీనిపై ఇప్పటి వరకు స్టేషన్‌కు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు సీఐ కె. వాసు తెలిపారు.

బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లను తలపిస్తున్న దుకాణాలు

తాడికొండ, తుళ్లూరు మండలాల్లో వైన్స్‌ దుకాణాలు బార్‌ అండ్‌ రెస్టారెంట్లను తలపిస్తున్నాయి. పర్మిట్‌ రూంకు అవకాశం లేనప్పటికీ నిర్వాహకులు షెడ్డులలో సిట్టింగ్‌కు అనుకూలంగా బల్లలు ఏర్పాటు చేసి, నిత్యం తాగుబోతులకు నిలయంగా మారుస్తున్నారు. అక్కడే వాటర్‌, సోడాలు, టచ్చింగ్‌, చికెన్‌ పకోడీ సహా అమ్మకాలు చేస్తుండటంతో వైన్స్‌ దుకాణాలు నిత్యం తాగుబోతులతో కిటకిటలాడుతున్నాయి. తుళ్లూరులో వైన్స్‌ దుకాణం రాజధాని నిర్మాణ కార్మికులతో కళకళలాడుతోంది. నిత్యం వందలాది మంది కార్మికులు కూర్చొని తాగేందుకు వీలుగా బెంచీలు, పెద్ద షెడ్డును దుకాణదారులు ఏర్పాటు చేశారు. రాత్రిపూట కూడా వ్యక్తులను ఏర్పాటు చేసి, అదనంగా ధరలు వసూలు చేస్తూ 24 గంటల అమ్మకాలు జరుపుతున్నారు. ఇంత జరుగుతున్నా ఎకై ్సజ్‌ అధికారులు నామమాత్రపు దాడులు మినహా తొంగిచూసిన దాఖలాలు లేవు. దీంతో నిత్యం వివాదాలకు నిలయంగా వైన్స్‌ దుకాణాలు మారుతున్నాయి. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి వైన్స్‌ దుకాణాల వద్ద తాగుబోతుల వీరంగానికి కళ్లెం పడేలా చూడాలని పలువురు కోరుతున్నారు.

తాడికొండలో ఘటన చిలికి చిలికి ముదిరిన వివాదం రెండు సామాజిక వర్గాల యువకులు భారీగా మోహరింపు వైన్స్‌ వద్ద నిత్యం వివాదాలు

మద్యం మత్తులో యువకుల ఘర్షణ 1
1/2

మద్యం మత్తులో యువకుల ఘర్షణ

మద్యం మత్తులో యువకుల ఘర్షణ 2
2/2

మద్యం మత్తులో యువకుల ఘర్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement