
చలపతి ఇంజినీరింగ్ కళాశాలకు ఎన్‌బీఏ అక్రిడిటేషన్
మోతడక (తాడికొండ): మోతడక చలపతి ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలకు కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ప్రొగ్రామ్‌లకు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ న్యూ ఢిల్లీ మూడు సంవత్సరాల కాల వ్యవధితో రెండోసారి అక్రిడిటేషన్ మంజూరు చేసిందని కళాశాల చైర్మన్ వై.వి.ఆంజనేయులు తెలిపారు. ఎన్‌బీఏ ఇచ్చిన ఎక్స్‌ఫర్ట్ కంపెనీ ఫిబ్రవరి 15న కళాశాలను సందర్శించి వసతులు, పాటిస్తున్న విద్యా ప్రమాణాలు, జరుగుతున్న పరిశోధన, అభివృద్ధికి సంబంధించిన విషయాలు, అధ్యాపకుల ప్రమా ణాలు, సంస్థలో పాటిస్తున్న విద్యాబోధన, తదితర వాటిని పరిశీలించి అక్రిడిటేషన్ మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈసందర్భంగా కళాశాలకు అక్రిడిటేషన్ గుర్తింపు రావడంపై చైర్మన్ వై.వి.ఆంజనేయు లు, కార్యదర్శి వై.సుజిత్‌కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.నాగశ్రీనివాస్‌లు హర్షం వ్యక్తం చేశారు. గుర్తింపు రా వడానికి కారకులైన విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అకడమిక్ డీన్ ఫణికుమార్, డాక్టర్ పి.బాలమురళీకృష్ణ, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ జయకృష్ణ, పలు శాఖాధిపతులు పాల్గొన్నారు.