
విద్యార్థినులకు జెడ్పీ చైర్‌పర్సన్ అభినందనలు
గుంటూరు ఎడ్యుకేషన్ : గత నెలలో విడుదలైన టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో కొల్లిపర మండలం మున్నంగి జెడ్పీ హైస్కూల్ నుంచి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులను జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా మంగళవారం గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో అభినందించారు. 587 మార్కులు సాధించిన చుక్కా జీవన్, 583 మార్కులు పొందిన నలుకుర్తి సుచరిత, 580 సాధించిన మున్నంగి మహిమను అభినందించిన హెనీ క్రిస్టినా భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థినులు ఎంచుకున్న లక్ష్యంపై గురి పెట్టి, ఉన్నత చదువులు చదవాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని అన్నారు. ఈసందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.అప్పారావుతోపాటు ఉపాధ్యాయులు పి. సాంబశివరావు, వి.నాగ వరప్రసాద్‌ను అభినందించారు.