
జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి
ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీకి ఎక్సలెంట్ ప్లేస్‌మెంట్ అవార్డు
కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
నీరుకొండ(మంగళగిరి): నీరుకొండలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీకి ఎక్సెలెంట్ ప్లేస్‌మెంట్ అవార్డు లభించింది. ఈ మేరకు యూనివర్సిటీ నిర్వాహకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసియా టుడే మీడియా సంస్థ 15వ అంతర్జాతీయ విద్యా సదస్సును ఆదివారం న్యూఢిల్లీలో నిర్వహించింది. ఇందులో 2023–24లో దేశవ్యాప్తంగా ప్లేస్‌మెంట్‌లో అగ్రస్థానం సాధించిన ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీకి ఎక్సలెంట్ ప్లేస్‌మెంట్ అవార్డు వచ్చింది. సదస్సులో కేంద్ర జలశక్తి మంత్రి రాజ్ భూషన్ చౌదరి అవార్డును యూనివర్సిటీ ప్రతినిధి వివేకానందకు అందజేసి అభినందనలు తెలిపారు.