12 నుంచి ఐఏఎస్‌ ఫౌండేషన్‌ తరగతులు | - | Sakshi
Sakshi News home page

12 నుంచి ఐఏఎస్‌ ఫౌండేషన్‌ తరగతులు

May 4 2025 6:55 AM | Updated on May 5 2025 10:28 AM

12 నుంచి ఐఏఎస్‌ ఫౌండేషన్‌ తరగతులు

12 నుంచి ఐఏఎస్‌ ఫౌండేషన్‌ తరగతులు

గుంటూరు ఎడ్యుకేషన్‌ : స్టూడెంట్‌ యూనియన్‌ ఆఫ్‌ నేషన్‌, కేవీఆర్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి 21 వరకు ఐఏఎస్‌ ఫౌండేషన్‌ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు తెలిపారు. శనివారం గుంటూరులోని యూటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో ఐఏఎస్‌ ఫౌండేషన్‌ తరగతుల పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ 8, 9, 10వ తరగతులతో పాటు ఇంటర్‌ విద్యార్థులకు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు బ్రాడీపేట 2/6లోని యూటీఎఫ్‌ కార్యాలయ సమావేశ మందిరంలో జరుగుతాయని చెప్పారు. సివిల్‌ సర్వీసెస్‌, ఐఏఎస్‌ పరీక్షల పట్ల పాఠశాల స్థాయిలో అవగాహన కల్పించి సివిల్స్‌ పై లక్ష్యాన్ని కలిగించడమే ముఖ్య లక్ష్యంగా తరగతులు ఉంటాయని చెప్పారు. 10 రోజులపాటు నిపుణులు క్లాసులు బోధిస్తారని తెలిపారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి సర్వీస్‌లకు ఎంపిక కావడం ద్వారా ప్రజలకు సేవలు అందించవచ్చని విద్యార్థులకు వివరిస్తారని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు తల్లిదండ్రులు 63094 81514, 79959 02645, 94948 08589 సెల్‌ఫోన్‌ నంబర్లలలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఆశిష్‌, మనీష్‌, వివేక్‌, ప్రతిమ, హరిత, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement