30 రోజుల్లో ఏడు కిలోలు..! ఆ 15 రూల్స్‌ మస్ట్‌ | Weight Loss Tips, Fitness Trainer Shares 15 Rules On How To Lose 7 Kg In 30 Days, Read Story Inside | Sakshi
Sakshi News home page

30 రోజుల్లో ఏడు కిలోలు..! ఆ 15 రూల్స్‌ మస్ట్‌

May 28 2026 10:22 AM | Updated on May 28 2026 12:05 PM

Weight loss Tips: Lose 7 Kg In 30 Day: Fitness Trainer Shares 15 Rules

అందరికీ స్మార్ట్‌గా, స్లిమ్‌గా అవ్వాలని ఉంటుంది. కానీ తక్కువటైంలోనే తగ్గాలనేది అందరి కోరకి. కానీ ఆ క్రమంలో శరీరం కాస్త ఒత్తిడికి గురై బరువు తగ్గడం ఎలా ఉన్నా అధిక బరువు పెరిగిపోతుంటాం. అలాంటి వాళ్లు హెల్దీ కమ్‌ స్పీడ్‌గా బరువు తగ్గేందుకు ఈ 15 రూల్స్‌ని ఫాలో అయితే చాలని అంటున్నారు ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ తకై రాషిద్. కేవలం చీటింగ్‌కి తావు లేకుండా క్రమశిక్షణతో కూడిని దినచర్యకు కట్టుబడి ఉంటే చాలని అంటున్నారామె. అలాంటప్పుడే ఈ 15 నియమాలు చాలా సమర్థవంతంగా ఫలితాలనిస్తాయిని చెబుతున్నాడు.

క్రమబద్దమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామాలు, సరైన నిద్ర, క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటించే డెడికేషన్‌ తదితరాలు ఉంటే 30 రోజుల్లో బరువు తగ్గడం సులభమేనని అంటున్నారు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ తకై రాషిద్. అందుకోసం ప్లాన్‌ ఎలా ఉండాలో సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. 

నియంత్రిత ఆమారం, అధిక ప్రోటీన్‌తో కూడినా ఆహారాలు, శారీరక శ్రమ వంటి వాటితో కొలెస్ట్రాల్‌ తగ్గుతుందని చెబుతున్నారు రాషిద్‌. అందుకోసం స్ట్రిక్ట్‌గా శిక్షణను కొనసాగించాలని నొక్కి చెప్పారు. ఆ వెయిట్‌లాస్‌ ప్లాన్‌ ఏంటంటే..

కేలరీల లోటుతో తినండి
నిర్వహణ స్థాయి కంటే 500-750 తక్కువ. గ

రోజువారీ ప్రోటీన్ లక్ష్యాన్ని చేరుకోండి
శరీర బరువులో ప్రతి పౌండ్‌కు 0.8-1 గ్రా. చాలా మందికి కనీసం 130-180 గ్రా.

ప్రతి భోజనంలో 20-30 గ్రా ప్రోటీన్ తినండి
ప్రోటీన్‌కు అనుగుణంగా ప్రతి భోజనం ఉండాలి

వారానికి కనీసం 3 సార్లు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండి
వారానికి 3-5 సార్లు ఇంక్లైన్ వాక్ / స్టెయిర్‌మాస్టర్ చేయండి 30-45 నిమిషాలు. ఈ వారం నేను పంచుకున్న వాకింగ్ ఛాలెంజ్ లాగా.

ప్రతిరోజూ పదివేల పైనే అడుగులు నడవడం
ఇది ఒత్తిడి లేకుండా కొవ్వును కరిగించడం.

రాత్రికి 7-9 గంటలు నిద్రపోండి
నిద్ర లేకపోతే కొవ్వు కరగడం నెమ్మదిస్తుంది.

భోజనాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోండి
ప్రణాళిక లేకపోతే ఇష్టం వచ్చినట్లు తినడంతో ఫలితం పొందలేరు. ప్రధానంగా సంపూర్ణ ఆహారాలనే తినండి. కొవ్వు తక్కువగా ఉండే మాంసం, అన్నం, గుడ్లు, పండ్లు, ఓట్స్, ఆకుకూరలు.

అధిక కేలరీలు గల పానీయాలను మానుకోండి
నీళ్లు, కాఫీ, కేలరీలు లేని పానీయాలు. స్మూతీలను లెక్కపెడితే ఫర్వాలేదు.

ప్రాసెస్ చేసిన చక్కెరను తగ్గించండి
మిఠాయిలు, పేస్ట్రీలు, చక్కెర కలిపిన తృణధాన్యాలు, లేదా జంక్ ఫుడ్ వద్దు.

చివరగా 30 రోజుల పాటు చీట్ మీల్స్ వద్దు

ప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే బరువు చూసుకోండి

మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా..స్మార్ట్‌గా మారాలన్న లక్ష్యంపై గురిపెడితే ప్రతి శారీరక బాధ ఇష్టంగా మారుతుందని అంటున్నారు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ తకై రాషిద్ . 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: వైట్‌ రైస్‌ వర్సెస్‌ బ్రౌన్‌ రైస్‌ ఆరోగ్యానికి ఏది మంచిదంటే..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement