'టీ'ని అతిగా మరిగిస్తున్నారా? ఎంత వ్యవధిలో చేయాలంటే.. | Sakshi
Sakshi News home page

'టీ'ని అతిగా మరిగిస్తున్నారా? ఎంత వ్యవధిలో చేయాలంటే..

Published Wed, May 22 2024 12:34 PM

Is Overboiling Milk Tea Harmful For Health And Side Effects

చాలామంది రోజుని ఓ కప్పు 'టీ'తో ప్రారంభిస్తారు. చక్కగా పాలతో చేసుకునే 'టీ' అంటేనే చాలమంది ఇష్టంగా ఆస్వాదిస్తుంటారు. అయితే ఈ 'టీ'ని తయారీలో చాలామంది మంచి చిక్కటి 'టీ' కోసం అదేపనిగా మరిగిస్తుంటారు. కాస్త మరిగిన 'టీ'నే మంచి రుచి అని చాలామంది ఫీలింగ్‌. అయితే ఇలా అస్సలు చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా ఇలాంటి చిక్కటి టీ తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మరీ ఎలా ప్రిపేర్‌ చేసుకుని తాగితే మంచిదంటే..

ప్రతి ఒక్కరూ టీని పలు విధాలుగా తయారు చేసుకుని ఆస్వాదిస్తుంటారు. కొందరూ 'టీ'ని ఆకులతో చేయడానికి ఇష్టపడతారు. మరికొందరూ కొద్దిగా పాలను, చక్కెరను జోడించి తయారు చేసుకుంటారు. ఇలా తయారు చేసేటప్పుడూ బాగా మరిగిస్తుంటారు. కొందరూ చల్లారిపోవడం వల్ల మరేదైన కారణం వల్లనో తరుచుగా అదేపనిగా వేడిచేసి తాగుతుంటారు. ఇలా కూడా అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. 

ఇలా బాగా మరిగిపోయిన చిక్కటి 'టీ' తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. సాధారణంగా 'టీ' తాగడం వల్ల బరువు తగ్గుతారు, రక్తంలో చక్కెర నియంత్రణ వంటి మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఎప్పుడైతే అదే పనిగా కెఫిన్‌ పానీయాన్ని ఇలా వేడి చేస్తుంటామో అది మన ఆరోగ్యాన్నికి హానికరంగా మారిపోతుందని చెబుతున్నారు నిపుణులు. 

'టీ'లో టానిన్‌లు ఉంటాయి. దీనిలో పాలీఫెనోలిక్‌ జీవ అణువులు ఉంటాయి. అది ప్రోటీన్లు, సెల్యులోజ్‌, పిండి పదార్థాలు, ఖనిజాలతో బంధించే పెద్ద అణువులు. ఎప్పుడైతే టీని మరిగిస్తామో ఇవి కరగని పదార్థాలుగా మారి శరీరంలోని ఐరన్‌ శోషణకు ఆటంకం కలిగిస్తాయి. అసలు బాగా మరిగించిన 'టీ' తాగడం వల్ల తలెత్తే దుష్ప్రభావాలేంటంటే..

పోషకాల నష్టం
టీని నిరంతరం ఉడకబెట్టడం వల్ల పాలలో ఉండే కాల్షియం, విటమిన్లు B12, సీవంటి పోషకాలు క్షీణిస్తాయి.

రుచి మార్పు
పాలను ఎక్కువగా ఉడకబెట్టడం వల్ల మాడిన వాసనలాంటి రుచిలా ఉంటుంది. 

అజీర్ణం
అతిగా ఉడకబెట్టడం వల్ల పాలలోని ప్రొటీన్ల డీనాటరేషన్‌కు దారి తీస్తుంది, వాటి నిర్మాణాన్ని మారుస్తుంది. ఫలితంగా అజీర్ణం వంటి సమస్యలు తలెత్తి కడుపునొప్పి, ఆమ్లత్వం, ఉబ్బరం, గ్యాస్‌ వంటి సమస్యలకు దారితీస్తుంది.

అసిడిటీ సమస్య..
టీని మరిగించడం వల్ల దానిలో ఉండే పీహెచ్‌ మారుతుంది. మరింత ఆమ్లంగా మారుతుంది. 

హానికరమైన మిశ్రమాలు
అధిక ఉష్ణోగ్రత కారణంగా మెయిలార్డ్ వంటి హనికరమైన మిశ్రమాలను ఏర్పరుస్తుంది.

క్యాన్సర్ కారకాలు
మరిగిన టీలో యాక్రిలామైడ్ వంటి మిశ్రమాలు కూడా ఉత్పత్తి అవుతాయి. ఇవి క్యాన్సర్‌ కారకాలు. ఎంతలా మరిగిస్తే అంతలా ఈ క్యాన్సర్‌ కారకాలు ఉత్పత్తి అవుతాయి.

టీ తయారీకి సరైన వ్యవధి..
కచ్చితంగా చెప్పాలంటే టీ తయారీకి జస్ట్‌ ఐదు నిమిషాలు చాలు. ఎక్కువసేపు కాయడం వల్ల టీలోని గుణాలు ఆక్సీకరణం చెందుతాయి. దీని వల్ల ఎలాంటి అదనపు ప్రయోజనాలు ఉండవు. 

ఉత్తమ పద్ధతి..
టీ అనంగానే పాలు పంచదారు, టీ పొడి వేసి మరిగించడం కాదంటున్నారు నిపుణులు. సరైన మార్గం ఏంటంటే..?. ఒక గిన్నెలో కొద్దిగా నీరు పోసుకుని, అందులో ఒక టీస్పూన్‌ టీ పొడి లేదా ఆకులను వేసి మూడు నుంచి నాలుగు నిమిషాలు మరిగించాలి. దానిలో కొద్దిగా వేడి చేసిన పాలు, చక్కెర వేసి..కప్పు టీని చక్కగా ఆస్వాదించండి. ఇలా చేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది కూడా. 

(చదవండి: కేన్స్‌ ఫెస్టివల్‌లో నిదర్శన గోవాని నవరత్న హారం! ఏకంగా 200 మంది కళాకారులు,1800 గంటలు..)

 

 

Advertisement
 
Advertisement
 
Advertisement