
ప్రస్తుతం ఈ రోజుల్లో ఏ వ్యాపారమైన క్లిక్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. ఎన్నో వైఫల్యాల అనంతరం గానీ లాభాల బాటపట్ట లేరు. కానీ కొందరూ పెట్టుబడితో పనిలేకుండా..ప్రస్తుత అవసరాలు, డిమాండ్ వంటి వాటికి అనుగుణంగా..పెట్టుబడితో పని లేకుండా తెలివిగా వ్యాపారం మొదలుపెట్టి సక్సెస్ అవుతుంటారు. అలాంటి వ్యక్తే ఈ ఆటోడ్రైవర్. జస్ట్ వినియోగదారుల నమ్మకాన్ని పొందడమే వ్యాపారానికి పెట్టబడిగా చేసుకుని లక్షలార్జిస్తున్నాడు.
అతడు ముంబైలోని ఓ సాధారణ ఆటో రిక్షా డ్రైవర్. డ్రైవింగ్ చేయకుండానే లక్షలు గడిస్తున్నారు. యూఎస్ కాన్సులేట్ వెలుపల అతడి వ్యాపారం సాగుతుంది. తన వ్యాపారానికి ఆధారమే ఆ యూఎస్ కాన్సులేట్. ఎందుకంటే అక్కడకు వీసా కోసం చాలమంది వ్యక్తులు వస్తుంటారు. అయితే వారి కూడా లగేజ్‌ని అనుమతించారు.
దీన్నే ఈ డ్రైవర్ తెలివిగా క్యాష్ చేసుకుంటున్నాడు. వ్యాపారంగా మార్చుకున్నాడు. సుమారు రోజుకి దగ్గర దగ్గర ఓ 20 నుంచి 30 మంది దాక ఈ యూఎస్ కాన్సులేట్ వద్దకు వీసా కోసం వస్తుంటారు. వారు పని పూర్తి చేసుకుని వచ్చేంత వరకు వారి లగేజ్‌ని సేఫ్‌గా ఉంచుతాడు ఈ డ్రైవర్. అందుకు ఒక్కొక్కరి నుంచి రూ.1000లు వసూల్ చేస్తాడట. స్థానిక పోలీసులు భాగస్వామ్యంతో లగేజ్ కోసం లాకర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకుని లక్షలు గడిస్తున్నాడు అతను.
చెప్పాలంటే ఐటీ డైరెక్టర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు రేంజ్‌లో నెలకు సుమారు రూ. 5 నుంచి రూ. 8 లక్షలు ఈజీగా ఆర్జిస్తున్నాడని లెన్స్‌కార్ట్ ఉత్పత్తిదారుడు లింక్డ్ ఇన్‌పోస్ట్‌లో తెలిపారు. తాను వీసా కోసం యూఎస్ కాన్సులెట్ వద్దకు వచ్చినప్పుడే ఈ డ్రైవర్ గురించి తెలిసిందన్నారు. తనను కూడా సెక్యూరిటీ లగేజ్ అనుమతించనని చెప్పినప్పుడు..ఏం చేయాలో తోచక ఫుట్‌పాత్‌పై నిలబడి ఉంటే ఈ ఆటో డ్రైవర్ చేయి ఊపి..లగేజ్ సురక్షితంగా ఉంటుంది. జస్ట్ రూ. 1000 ఛార్జ్ చేస్తే చాలు అని చెప్పినప్పుడూ అతడి వ్యాపారం గురించి తెలిసిందని చెప్పుకొచ్చారు.
అతడి వద్ద వ్యాపార నైపుణ్యం, సాంకేతిక, నిధులు లేకపోయినా.. జస్ట్ నమ్మకంతో కస్టమర్లకు భద్రత అందించి ప్రీమియం వసూలు చేస్తూ..వ్యాపారం చేస్తున్నాడు. సమయస్ఫూర్తితో చేస్తున్న అతడి వ్యాపారదక్షతను పోస్ట్‌లో ప్రశంసించారు రూపానీ. ప్రస్తుం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అవసరాలకు, డిమాండ్‌కు అనుగుణమైన వ్యాపారం ఆటోమేటిగ్గా క్లిక్ అవుతుందని ఈ ఆటో డ్రైవర్ ప్రూవ్ చేశాడు. అయితే నెటిజన్లు మాత్రం అంతలా డబ్బులు ఛార్జ్ చేస్తున్నా.. పోలీసులతో కలిసి షేర్ చేసుకోవాల్సిందేగా అని ఒకరు, కాన్సులేట్ లోపల లాకర్ సౌకర్యం ఉందని మరొకరు కామెంట్ చేస్తూ పోస్టుల పెట్టారు.
గమనిక: ఇది వాస్తవమేనా అనేది తెలియాల్సి ఉంది. ఎన్డీటీవి ఇంగ్లీష్ ఆర్టికల్ ఆధారంగా ఇవ్వడం జరిగింది.
(చదవండి: డాక్టర్ కాబోయి.. మేకప్ ఆర్టిస్ట్‌గా నం.1 స్థానం..)