
అదే తేదీ నుంచి వరుసగా ఏడురోజుల పాటు భాషా వారోత్సవాలు
తీర్మానం విడుదల చేసిన ప్రభుత్వం
అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కాలేజీలు, స్కూళ్లలో విధిగా నిర్వహించాలని ఆదేశం
ముంబై: గత ఏడాది మరాఠీకి శాస్త్రీయ భాష హోదా లభించిన నేపథ్యంలో ఇకపై ప్రతి సంవత్సరం అక్టోబర్ 3న ’శాస్త్రీయ మరాఠీ భాషా దినోత్సవం’గా జరపనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, అక్టోబర్ 3 నుంచి 9 వరకు ప్రతి సంవత్సరం ’శాస్త్రీయ మరాఠీ భాషా వారోత్సవాలు’జరపాలని పేర్కొంటూ తీర్మానాన్ని విడుదల చేసింది. ప్రాచీన మరాఠీ భాషా, సాహిత్య, సాంస్కృతిక వారసత్వాలపై అవగాహన పెంపొందించడం, వాటిని సంరక్షించడమే ఈ తీర్మానం లక్ష్యమని పేర్కొంది.
ఈ తీర్మాననుసరించి నిర్దేశిత వారంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు, ఆర్థిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు ఈ తీర్మానాన్న నుసరించి భాషా సంరక్షణకు సంబంధించి ఉపన్యా సాలు, సెమినార్లు, పురాతన గ్రంథాలు, శాసనాల ప్రదర్శనలు, క్విజ్‌లు, వ్యాస పోటీలు, ఇతర విద్యా, సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది.

పురాతన రచనల డిజిటలైజేషన్, శాస్త్రీయ గ్రంథాలను ఆధునిక మరాఠీలోకి అనువదించడం , భాషా సంరక్షణ పద్ధతులపై డాక్యుమెంటరీల ప్రదర్శనల వంటి కార్యక్రమాలు చేపట్టాల్సిఉంటుంది. అరుదైన లిఖిత ప్రతులు, పురాతన రాగి ఫలక శాసనాల ప్రదర్శనలు విద్యార్థులు, ప్రజలను మరాఠీ భాష, సంప్రదాయంతో అనుసంధానించేందుకు ఎంతోగానో తోడ్పడతాయని జీఆర్‌లో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లను మరాఠీ భాషా కమిటీలకు అధిపతులుగా నియమించారు. వీరు కార్యక్రమాల ప్రణాళిక రూపకల్పన, వాటి అమలును పర్యవేక్షించాల్సి ఉంటుందని కోరారు. ప్రత్యేక వారంలో నిర్వహించిన కార్యకలాపాల వివరణాత్మక నివేదికలను అక్టోబర్ 31 నాటికి లాంగ్వేజ్ డైరెక్టరేట్‌కు సమరి్పంచాలని ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇందుకవసరమైన ఖర్చును సంబంధిత విభాగాలు, కార్యాలయాల సాధారణ బడ్జెట్ నుంచి కేటాయిస్తామని తెలిపింది.