చికెన్‌, ఫిష్‌ కబాబ్స్‌ల్లో కృత్రిమ రంగుల వాడకం నిషేధం! | Karnataka Government Bans Artificial Colours In Kebabs | Sakshi
Sakshi News home page

చికెన్‌, ఫిష్‌ కబాబ్స్‌ల్లో కృత్రిమ రంగుల వాడకం నిషేధం!

Published Tue, Jun 25 2024 8:38 AM | Last Updated on Tue, Jun 25 2024 8:42 AM

Karnataka  Government Bans Artificial Colours In Kebabs

రెస్టారెంట్లలోనూ, హోటల్స్‌లోనూ ఆహారం ఆకర్షణీయంగా ఫుడ్‌ కలర్స్‌ ఉపయోగిస్తుంటారు. మనం కూడా అలా కనిపిస్తే ఆవురావురామంటూ తినేస్తాం. కానీ దీని వల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటూ వాటిపై నిషేధం విధించారు అధికారులు. ఒకవేళ ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏకంగా ఏడేళ్లు దాక జైలు శిక్ష పడుతుందట. ఈ నిషేధం ఎక్కడంటే..

శాకాహారం దగ్గర నుంచి నాన్‌వెజ్‌లలో చికెన్‌, ఫిష్‌ కబాబ్స్‌లపై కృత్రిమ రంగులు వాడుతుంటారు. తినేవాడికి నోరూరించేలా ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఇలా చేస్తుంటారు. ముఖ్యంగా కబాబ్స్‌ల వంటి వాటికి ఎక్కువగా కృత్రిమ రంగులు వినయోగిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కర్ణాట ప్రభుత్వం సోమవారం ఈ నిషేధం విధించింది. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొంది. 

ఈ కృత్రిమ రంగులు శరీరానికి హానికరమని, ప్రతికూల ఆరోగ్య  ప్రభావాలను కలిగిస్తాయని చెబుతోంది. ఈ విషయమై కర్ణాటక ఆహార భద్రత ప్రమాణాల విభాగానికి వివిధ ఫిర్యాదులు అందాయి. దీంతో కృత్రిమ రంగులను ఉపయోగించే 39 తినుబండరాల నమునాలను పరీక్షించగా వాటిలో సుమారు ఎనిమిది కృత్రిమ రంగుల ఉపయోగిస్తున్నారని,అవి సురక్షితం కాదని తేలింది. 

ఈ నేపథ్యంలోనే కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు  కృత్రిమ రంగులను ఉపయోగించే తినుబండారాలను బ్యాన్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాదు ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా వెల్లడించడమే గాక ఈ నిబంధనలను ఉల్లంఘించిన ఆహార విక్రేతలపై పది లక్షల జరిమానా, ఏడేళ్లు జైలు శిక్షతో సహా పలు తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 
(చదవండి: 90 ఏళ్ల వృద్దుడికి అరుదైన వ్యాధి..కడుపు ఛాతిలోకి చొచ్చుకుపోయి..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement