
నేడు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం
ఫ్యామిలీ అంటే...జీవితం మొదలయ్యే చోటు. ప్రేమ ఎప్పటికీ అంతం కాని చోటు. ‘భారతదేశ బలం కుటుంబం’ అంటారు. అయితే కాలంతో పాటు కుటుంబ ముఖచిత్రం మారిపోయింది. ఉమ్మడి కుటుంబాలు కనిపించడం అరుదైపోయింది. కుటుంబం అసాధారణమైన బలం ఇస్తుంది. అద్భుత విజయాలు సాధించేలా చేస్తుంది. ఈ స్పృహతో ముందుకు వెళదాం...
ఆ విషాదంలో ఒకరికి ఒకరు అండగా...
‘ఫ్యామిలీ నా స్ట్రెంత్’ అని తరచుగా చెబుతుంటుంది బాలీవుడ్ నటి జాన్వీ కపూర్. శ్రీదేవి చనిపోవడం జాన్వీ కుటుంబానికి షాక్. ఆ విషాదం నుంచి బయట పడడానికి కుటుంబ సభ్యులు ఒకరికి ఒకరు అండగా నిలిచారు. జాన్వీ ఎప్పుడైనా డల్‌గా కనిపిస్తే నాన్న బోనీ కపూర్ ఆ సమయంలో అమ్మగా మారిపోతాడు. తన కబుర్లతో జాన్వీ యాక్టివ్ అయ్యేలా చేస్తాడు. మరి బోనీ డల్‌గా కనిపిస్తే? కూతుళ్లు జాన్వీ, ఖుషీ తండ్రి దగ్గరకు వచ్చేస్తారు. నాన్నకు ఫ్రెండ్స్‌గా మారిపోతారు. నాన్న ఎప్పటిలాగే నవ్వేలా చేస్తారు.
ఆ ముగ్గురిలో ఏ మూలో విషాదం గూడుకట్టుకొని ఉండవచ్చు. అయితే వారు ఒక దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం సరదాలు, సంతోషాలే ఉంటాయి. కొన్ని సమయాల్లో చెల్లి ఖుషి అక్క జాన్వీకి అమ్మ అవుతుంది. ధైర్యం చెబుతుంది. దారి చూపుతుంది! ఖుషి విషయంలో జాన్వీ కూడా అంతే! తల్లి లేని లోటు రానివ్వకుండా సకల జాగ్రత్తలు తీసుకుంటుంది. ‘నాన్న, చెల్లి, అన్న అర్జున్ నాకు మెంటార్స్. నా జీవితానికి మార్గదర్శకులు. కెరీర్‌లో, జీవనగమనంలో వారు నా బలం’ అని తన కుటుంబం గురించి చెబుతుంది జాన్వీ కపూర్.
పెద్ద కుటుంబం...
మను బాకర్ బలం తన స్ట్రెంత్‌కు కేరాఫ్ అడ్రస్ చెప్పమంటే స్టార్ షూటర్ మను బాకర్ నోటి నుంచి వచ్చే మాట... గోరియా.హరియాణా రాష్ట్రం చర్కీ దాద్రి జిల్లాలోని గోరియా గ్రామంలో బాకర్ కుటుంబ సభ్యులు ఉంటారు. మను పతకాలు గెలుచుకున్నప్పుడల్లా ఆ కుటుంబ సంతోషం అంబరాన్ని అంటుతుంది.
పోటీలకు వెళ్లి స్వదేశానికి తిరిగివస్తున్నప్పుడు... కుటుంబ సభ్యులను కలవబోతున్నానే సంతోషం మనూను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆమె తండ్రి రామ్ కిషన్ బాకర్ నేవీలో చీఫ్ ఇంజనీర్. తల్లీ సుమేధ స్కూల్ ప్రిన్సిపల్. ఆటల్లో కూతురుని ఎంతో ప్రోత్సహించేవారు. అవసరమైన ట్రైనింగ్ ఇచ్చేవారు. ‘మీ అమ్మాయిని డాక్టర్ చేస్తారా? ఇంజనీర్ చేస్తారా?’ అని బంధువులు అడిగినప్పుడు.... ‘ఛాయిస్ మాది కాదు... మనూ దే’ అనే వాళ్లు.
ఇదీ చదవండి: దేశానికి సేవ చేయాలని కలగన్నాడు..కానీ, పెళ్లైన నాలుగునాళ్లకే
అలా తల్లిదండ్రులు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్లే మను బాకర్ స్టార్ షూటర్ అయింది. మను బాకర్‌కు ఊళ్లో మరో పెద్ద కుటుంబం ఉంది. ఆ కుటుంబం పేరు యూనివర్శల్ హైయర్ సెకండరీ స్కూల్. మను కుటుంబమే ఈ స్కూల్‌ను నడుపుతుంది. ఈ స్కూల్‌లోని పిల్లలందరికీ మను బాకర్ అక్క. దయా కౌర్ తనకు అమ్మమ్మ కాదు... క్లోజ్ ఫ్రెండ్! ‘సంతోషంలో ఉన్నప్పుడైనా, బాధలో ఉన్నప్పుడైనా ఈ సమయంలో నా ఫ్యామిలీ నాతో ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అదే ఫ్యామిలీకి ఉన్న బలం’ అంటుంది మను బాకర్.
పిల్లలకు కుటుంబ విలువ తెలియజేసే పుస్తకాలు
కుటుంబ బంధాలు, శక్తి గురించి పిల్లలకు సులభమైనరీతిలో అవగాహన కలిగించడానికి ‘సెర్చ్ ఇనిస్టిట్యూట్’ సంస్థ ‘ఫస్ట్ లుక్’ భాగస్వామ్యంతో కొన్ని పుస్తకాలు విడుదల చేసింది... ‘ఫ్యామిలీ స్ట్రెంత్’ను పిల్లలకు తెలియజేయడానికి టాడ్ పార్ రాసి, బొమ్మలు వేసిన పుస్తకం...ది ఫ్యామిలీ బుక్. ‘హ్యాపీ లైక్ సాసర్: ఇన్‌వెస్ట్’ పుస్తకాన్ని మారిబెత్ బోయిల్డ్స్ రాశారు. లారెన్ కాస్టిలో బొమ్మలు వేశారు. అవర్ ట్రీ నేమ్‌డ్ స్టీవ్(ఫ్యామిలీ స్ట్రెంత్: బీ డిపెండబుల్) పుస్తకాన్ని అలాన్ జ్వైబెల్ రాశారు. డేవిడ్ కాట్రో బొమ్మలు వేశారు. సాల్ట్ ఇన్ హిజ్ షూస్(ఫ్యామిలీ స్ట్రెంత్: గైడ్) పుస్తకాన్ని మైఖేల్ జోర్డన్ రాశారు. నెల్సన్ బొమ్మలు వేశారు. అమేజింగ్ గ్రేస్(ఫ్యామిలీ స్ట్రెంత్: ఇన్‌స్పైర్) పుస్తకాన్ని మేరీ హఫ్మాన్ రాశారు. కరోలైన్ బించ్ బొమ్మలు వేశారు. (పురుషులూ మేలుకోండి.. హాట్ టాపిక్‌గా ఇద్దరు మహిళల పెళ్లి!)
ఫ్యామిలీ మైండ్‌సెట్ కోచ్!
‘ఫ్యామిలీ డైనమిక్స్‌లో సమగ్రమైన, సమర్థమైన మార్పులు తేవడమే మా లక్ష్యం’ అంటున్నారు ఫ్మామిలీ మైండ్‌సెట్ కోచ్‌లు. ఫ్యామిలీ మైండ్‌సెట్ కోచింగ్‌ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది? అనే విషయానికి వస్తే...కుటుంబ సంబంధాలను బలోపేతం చేయడానికి వ్యక్తిగత, గ్రూప్ సెషన్లు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల మధ్ భేదాభిప్రాయాలు ఉంటే గ్రూప్ సెషన్‌లలో ఓపెన్ కమ్యూనికేషన్ ద్వారా లేకుండా చేస్తారు. ‘సైకోమెట్రిక్ అసెస్‌మెంట్’ప్రోగ్రాం ద్వారా కుటుంబ సభ్యులలో ప్రతి ఒక్కరి బలాబలాలను అంచనా వేసి అవసరమైన సలహాలు ఇస్తారు.