జలుబుకు ఔషధంగా చికెన్‌ సూప్‌ ఎలా పనిచేస్తుందంటే..?  | How Does Chicken Soup Work As Medicine For Cold And Flu | Sakshi
Sakshi News home page

జలుబుకు ఔషధంగా చికెన్‌ సూప్‌ ఎలా పనిచేస్తుందంటే..? 

Jun 4 2022 11:48 PM | Updated on Jun 4 2022 11:48 PM

How Does Chicken Soup Work As Medicine For Cold And Flu - Sakshi

బాగా జలుబు చేసినప్పుడు చాలామంది చికెన్‌ సూప్‌ చేయించుకుని తాగడం లేదా సూప్‌లా వండిన చికెన్‌గ్రేవీతో అన్నం తినడం చేస్తుంటారు. చాలామంది ఇది ఓ సంప్రదాయ చికిత్స అనుకుంటారుగానీ... నిజానికి  చికెన్‌సూప్‌ ఉపశమనానికి బాగానే పనిచేస్తుంది. దీనికి శాస్త్రీయ కారణాలూ ఉన్నాయి. సూప్‌లా వండిన చికెన్‌లో ‘సిస్టిన్‌/సిస్టయిన్‌’ అనే అమైనో యాసిడ్‌ ఉంటుంది. ఇది మాత్రమే గాకుండా... ఇలా వండే సమయంలో ఆ సూప్‌లోకి ఖనిజ లవణాలూ, విటమిన్లతో పాటు మంచి పోషకాలన్నీ ద్రవంలా ఉడికే సూప్‌లోకి స్రవిస్తాయి.

ఇదే సూప్‌లోకి ‘గ్లైసిన్‌’, ‘ప్రోలైన్‌’ లాంటి అనేక అమైనో యాసిడ్స్‌ సముదాయమైన జిలాటిన్‌ కూడా స్రవిస్తుంది. ఈ అమైనో యాసిడ్‌లూ, ఇతర పోషకాలు కలగలసిన సూప్‌ మన వ్యాధి నిరోధకశక్తిని మరింతగా పెంచుతుంది. ఈ అంశాలన్నీ జలుబు ఇతరత్రా ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. అంతేకాదు... ఈ చికెన్‌సూప్‌ దాదాపు ద్రవరూపంలో ఉండటం త్వరగా జీర్ణం కావడంతో పాటు అన్ని పోషకాలను వేగంగా దేహానికి అందిస్తుంది. జీర్ణశక్తినీ, కాలేయం పనితీరును మెరుగుపరిచి, ఎముకలను మరింత పటిష్టం చేయడానికీ చికెన్‌సూప్‌ దోహదపడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement