రోజూ ఓ కప్పు స్ట్రాబెర్రీలు తీసుకుంటే..డిమెన్షియా పరార్‌!

Eating 8 Strawberries A Day Prevent Depression And Dementia - Sakshi

స్ట్రాబెర్రీ అంటే ఇష్టంగా తినే వాళ్లకు ఇది గుడ్‌న్యూస్‌ అనే చెప్పాలి. శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన అధ్యయనంలో రోజూ స్ట్రాబెర్రీలు కనీసం ఎనిమిది తింటే డిప్రెషన్‌, డిమెన్షియా దరిదాపుల్లోకి కూడా రాదని చెబుతున్నారు. అందుకు సంబంధించిన పరిశోధనలు న్యూట్రియంట్స్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనలను సిన్సినాటి యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించారు. వారి పరిశోధనల్లో బయటపడ్డ ఆసక్తికర విషయాలెంటంటే..

సిన్సినాటి యూనివర్సిటీ పరిశోధకుల బృందం సుమారు 50 నుంచి 65 ఏళ్లు ఉన్న వ్యక్తుల సముహాలను రెండు గ్రూప్‌లుగా విడగొట్టారు. ఒక గ్రూప్‌ మొత్తానికి స్టాబెర్రీలు ఇవ్వగా, ఇంకో గ్రూప్‌కి సాధారణమైన రోజూవారి పళ్లను ఇచ్చారు. అయితే స్ట్రాబెర్రీలు క్రమతప్పకుండా తీసుకున్న గ్రూప్‌లో మెరుగైన జ్ఞాపకశక్తి, మానసిక స్థితి ఉన్నట్లు గుర్తించారు. అలాగే నిస్ప్రుహ లక్షణాలను అధిగమించినట్లు తెలిపారు. మిగతా సముహంలో మానసిక స్థితి చాలా అధ్వాన్నంగా ఉండటమే గాక డిప్రెషన్‌ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.

మెరుగైన ఫలితాలు కనిపించిన సముహంలో కేవలం ఐదుగురు పురుషులు, సుమారు 25 మంది దాక మహిళలు ఉన్నారని. వారిందరూ మెరుగైన మానసిక స్థితి, మంచి జ్ఞాపకశక్తిని కలిగి ఉన్నారని అన్నారు. 12 వారాల పాటు ఎనిమిది చొప్పున స్ట్రా బెర్రీలు ఇస్తేనే ఇంత మెరుగైన ఫలితం కనిసించిందంటే ఓ కప్పు స్ట్రాబెర్రీలు రోజూ తీసుకుంటే ఇంకెంతో ఫలితం ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ డిమెన్షియా అనేది వ్యాధి కాదు. ఇది ఒకరకమైన మానసిక చిత్త వైకల్యం. సింపుల్‌గా చెప్పాలంటే మెమరీ నష్టం అనొచ్చు. మెదడు గుర్తుంచుకోగల సామర్థ్యాన్ని కోల్పోవడం.

దీనివల్ల దైనందిన జీవితం గందరగోళంగా మారిపోతుంది. ఇది పార్కిన్‌సన్‌, అల్జీమర్స్‌ లాంటిదే కానీ దీనికి చికిత్స లేదు. జస్ట్‌ మందులతో నిర్వహించగలం అంతే. ఇది తగ్గటం అంటూ ఉండదు. చివరికి ఒకనొక దశలో ఆయా పేషెంట్లకు తినడం అనేది కూడా కష్టమైపోతుంది. ప్రస్తుతం యూకేలో 65 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి 11 మందిలో ఒకరు ఈ డిమెన్షియా బారినపడుతున్నట్లు సిన్సినాటి పరిశోధకుడు రాబర్ట్ క్రికోరియన్ తెలిపారు. అయితే మనకు అందుబాటులో ఉండే ఈ స్ట్రా బెర్రీ పళ్లల్లో విటమిన్‌ సీ, మాంగనీస్‌, ఫోలేట్ (విటమిన్ B9), పోటాషియంలు ఉంటాయి. వీటితో మానసిక సమస్యలకు సంబంధించిన రుగ్మతలను నుంచి సునాయసంగా బయటపడవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మందుల కంటే కూడా ఇలా ప్రకృతి ప్రసాదించినవే ప్రభావంతంగా పనిచేస్తాయని, పైగా మన ఆరోగ్యానికి కూడా మంచిదని అన్నారు. 

(చదవండి: ధూమపానంతో క్యాన్సర్‌ గాక ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా!)

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top