
‘కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్‌కు ఎక్కువ వాల్యూంతో ఇయర్ ఫోన్లు పెట్టుకొని పాటలు వినడం, సినిమాలు, రీల్స్ చూడడం ఇష్టం. బైక్‌పై వెళ్తున్నా.. బస్సుల్లో ప్రయాణిస్తున్నా.. ఆఫీసులో ఉన్నా.. రోడ్డుపై ఉన్నా ఇదే ధ్యాస. నిత్యం ఏడెనిమిది గంటలపాటు ఇదే పరిస్థితి. ఇటీవల అతనికి చెవిలో ఒకటే హోరు మొదలైంది. భరించలేక ఈఎన్‌టీ వైద్యుడిని సంప్రదిస్తే అసలు విషయం తెలిసింది. గంటల తరబడి ఎక్కువ సౌండ్‌తో ఇయర్ ఫోన్స్ వినడంతో చెవిలోపలి భాగంలో సమస్య తలెత్తినట్లు గుర్తించి చికిత్స చేశారు. అయినా పూర్థిస్థాయి ఫలితం రాలేదు.’
హుజూరాబాద్/కరీంనగర్ టౌన్: ఇయర్, హెడ్‌ఫోన్లు విచ్చలవిడిగా వాడుతున్నారా... గంటల కొద్దీ వాటితోనే కాలం గడుపుతున్నారా? అయితే జాగ్రత్త ఎక్కువ శబ్ధంతో వీటిని వినియోగించడం వల్ల కొందరిలో దీర్ఘకాలంగా వినికిడి శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఈఎన్‌టీ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చెవి, వినికిడి సమస్యతో వారానికి వేయి నుంచి 1500 మంది సంప్రదిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు్కలే ఉంటున్నారని పేర్కొంటున్నారు. సాధారణంగా ఇయర్ ఫోన్లు, హెడ్‌ఫోన్ల నుంచి వచ్చే ధ్వని తరంగాలు కర్ణభేరికి చేరుతాయి.
తర్వాత అవి చెవిలోని చిన్న ఎముక ద్వారా లోపలి చెవిని(ఇన్నర్ ఇయర్) తాకుతాయి. అక్కడ ఉన్న కోక్లియా వాటిని గ్రహిస్తుంది. ఎక్కువ శబ్ధం వినడంతో మొత్తం చెవి ఆరోగ్యంపైనే ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కోక్లియాలో అతి సూక్ష్మకణాలు, ద్రవం ఉంటాయి. అతి శబ్దం, దీర్ఘకాలిక, నిరంతర ధ్వనుల తాకిడి వల్ల అందులోని సున్నితమైన కణాలు దెబ్బతింటాయి. నిపుణుల సూచనల ప్రకారం ప్రతీ వ్యక్తి రోజుకు 8 గంటలపాటు 8,5 డెసిబుల్స్ శబ్దాల వరకు వింటే ఎలాంటి ఇబ్బంది ఉండదరు. అయితే చాలామంది 85–100 వరకు డెసిబుల్ సౌండ్స్‌తో ఇయర్ ఫోన్లు, హెడ్‌ఫోన్లు వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.
‘హుజూరాబాద్‌కు చెందిన శ్రావణికి (పేరు మార్చాం) ఫోన్‌లో రీల్స్ చూడడం.. పాటలు వినడం అలవాటు. ఎప్పుడు చూసినా ఇయర్ ఫోన్లు పెట్టుకొనే కనిపిస్తుంది. దీంతో ఆమె కర్ణభేరి దెబ్బతింది. రెండు చెవులు వినిపించడంలేదు. మెదడులో నరాలు దెబ్బతిన్నాయి. అప్పుడప్పుడు మతిస్థిమితం లేకుండా వ్యవహరిస్తోంది. డాక్టర్లను సంప్రదిస్తే అతిసీపం నుంచి శబ్ధం.. అంటే ఇయర్ ఫోన్స్ లాంటివి వాడితే ఇలాంటి ఇబ్బందులు వస్తాయని తెలిపారు. ఇప్పుడామెది ఏమీ వినలేని పరిస్థితి.’
‘సిరిసిల్లకు చెందిన పరమేశ్‌కు(పేరు మార్చాం) ఇయర్ ఫోన్స్ పెట్టి సెల్‌ఫోన్‌లో పాటలు వినడం, సినిమాలు చూడడం అలవాటు. క్రమంగా ఆయన వినికిడి శక్తిని కోల్పోయాడు. చెవిలో అతిదగ్గరినుంచి శబ్దం వినడంతో కర్ణభేరికి ఇబ్బందిగా మారిందని వైద్యులు చెప్పారు. ఇప్పుడాయనా చెవికి వినికిడి పరికరం అమర్చుకున్నాడు. లేదంటే ఆయన ఎలాంటి శబ్ధం వినలేడు’.
చెవికి తీవ్ర నష్టం
సెల్‌ఫోన్ వచ్చాక చెవుడు సమస్యలు ఎక్కువయ్యాయి. 12–34 ఏళ్ల మధ్య 24శాతం మంది పర్సనల్ లిసెనింగ్ డివైజ్ (హెడ్‌ఫోన్స్, ఇయర్ బడ్స్) వాడుతూ, 48శాతం మంది 85 డిసెబుల్స్ కన్నా ఎక్కువ శబ్దాన్ని వింటూ వినికిడి సమస్యల బారిన పడుతున్నారు. తీవ్రమైన శబ్దం వినడం వల్ల శ్రవణ వ్యవస్థలో ఉండే సూక్ష్మమైన హెయిర్ సెల్స్ దెబ్బతిని చెవుడు ఏర్పడుతుంది. డీజే సౌండ్ లాంటి అధిక వాల్యూమ్‌తో శాశ్వత చెవుడు వచ్చే అవకాశముంది. మ్యూజిక్, వాయిస్‌కాల్స్ హెడ్‌ఫోన్స్, ఇయర్ బడ్స్‌తో ఎక్కువ సమయం వినడం వల్ల బ్రెయిన్ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇయర్‌ఫోన్స్, హెడ్‌ఫోన్స్, సెల్‌ఫోన్, డీజే సౌండ్‌ను ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మేలు. – ప్రశాంత్,
ఈఎన్‌టీ నిపుణుడు
చెవి ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు
కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంలో వినికిడి సమస్య తలెత్తుతుంది. అందుకే లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు.
చెవుల్లో శబ్దాల హోరు
చిన్న శబ్దాలను కూడా వినలేకపోవడం
చెవుల్లో తరచూ ఇన్‌ఫెక్షన్లు, నొప్పి
అధికంగా గులిమి ఏర్పడడం
చెవిపై ఒత్తిడి పెరగడంతో వర్దిగో సమస్య
ఇయర్ ఫోన్స్ వాడొద్దు
ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. ప్రజలు మరింత సౌలభంగా ఉండేందుకు వీలుగా ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు. ప్రస్తుతం వచ్చిన ఇయర్ ఫోన్స్‌లో శబ్ద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. చెవి నొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యం కోసం ఇయర్ ఫో¯Œన్లను తక్కువ వాడటమే ఉత్తమం.
– రాజు, ఈఎన్‌టీ వైద్యుడు, హుజూరాబాద్