రోజూ బ్రేక్‌ఫాస్ట్‌గా ఓట్స్‌ తీసుకుంటున్నారా..? | Sakshi
Sakshi News home page

రోజూ బ్రేక్‌ఫాస్ట్‌గా ఓట్స్‌ తీసుకుంటున్నారా..?

Published Tue, May 28 2024 2:18 PM

Can You Eat Oats For Breakfast Every Day Know The Side Effects

ప్రజలు తమ జీర్ణక్రియను మెరుగుపరచడానికి, బరువు తగ్గడానికి ఎక్కువగా వినియోగించే తృణధాన్యాల్లో ఒకటి ఓట్స్‌. పైగా శరీరానికి పుష్కలమైన ఫైబర్స్‌ అందుతాయని దీనికే ప్రాధాన్యత ఇస్తుంటారు. ముఖ్యంగా డైటీషియన్లు, జిమ్‌ శిక్షకులు ఫైబర్‌ కంటెంట్‌ ఉండే ఓట్స్‌ని తీసుకోమని సూచిస్తారు. జీర్ణక్రియకు, బరువు తగ్గడానికి, చెడు కొలస్ట్రాల్‌ని తగ్గించడానికి తోడ్పడే ఓట్స్‌ని తీసుకోవడం మంచిదే అయినప్పటికీ దీన్ని డైట్‌లో భాగం చేసుకునేటప్పుడూ ఈ జాగ్ర త్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని అంటున్నారు నిపుణలు. లేదంటే దుష్పభావాలు తప్పవంటున్నారు.

రోజు ఎందుకు తినకూడదు..
నిపుణులు అభిప్రాయం ప్రకారం వోట్స్‌ కొన్ని రకాల దుష్ప్రభావాలను కలిగిస్తుందని పరిశోధనల్లో తేలింది. వారి ప్రకారం ఇది శరీరానికి విషపూరితం కావొచ్చని అంటున్నారు. శాస్త్రవేత్తలు 2017 నుంచి 2023 మధ్యకాలంలో జరిపిన అధ్యయనంలో చాలామంది అమెరికన్ల ఉపయోగించే ఓట్స్‌లో క్లోమరోమెక్వాట్‌ అనే విషపూరిత రసాయనం ఉన్నట్లు గుర్తించారు. 

ఆ పరిశోధనల్లో సుమారు 92% వోట్స్‌ ఆధారిత వాటిల్లో క్లోర్‌మెక్వాట్‌ గుర్తించదగిన స్థాయిల్లో ఉన్నట్లు కనుగొన్నారు. కొన్ని పెద్దపెద్ద బ్రాండ్‌ ఓట్స్‌లలో కూడా ఈ విషపూరిత రసాయనం ఉన్నట్లు గుర్తించారు. ఇది పునరుత్పత్తి అభివృద్ధిని ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది మానవులకు హాని కలిగించే అవకాశాలు ఎక్కుగా ఉన్నట్లు అని పరిశోధన వెల్లడించింది. 

బరువు పెరిగేందుకు..
ఓట్స్‌ బరువు తగ్గడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నప్పటికీ..ఇవి ఎక్కువగా తీసుకుంటే మాత్రం వ్యతిరేక పరిణామాలు చూపిస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ప్రతిరోజూ ఎక్కువగా ఓట్స్‌ తీసుకుంటే పెద్ద మొత్తంలో బరువు పెరిగే అవకాశాలు ఉంటాయని అంటన్నారు. అలాగే చాలామంది దీన్ని చక్కెర, నట్స్‌, చాక్లెట్‌ చిప్స్‌, ఉప్పుతో కలిపి తీసుకుంటారు. ఇలా తీసుకుంటే ప్రయోజనాల కంటే, సమస్యలే ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. 

పొట్ట ఉబ్బరం..
కొందరికి అదేపనిగా తృణధాన్యాలు తీసుకుంటే పొట్ట ఉబ్బరం కలిగిస్తాయి. అందువల్ల డైటీషియన్లు ఎప్పడూ కొద్ది మొత్తంలోనే తీసుకోమని సూచిస్తారు. దీన్ని జీర్ణశయాలు లేదా పెద్ద ప్రేగలలోని బ్యాక్టీరియాను వినియోగించుకోవటంతో గ్యాస్‌ ఫామ్‌ అయ్యి పొట్ట ఉబ్బరానికి దారితీస్తుంది.

గ్లూటెన్‌ సున్నితత్వం..
ఇవి గ్లూటెన్‌ రహితంగా ఉన్నప్పటికీ..తరుచుగా గోధుమ, బార్లీ మాదిరిగా ప్రాసెస్‌ చేయబడతాయి. ఇది ఉదరకుహార వ్యాధి లేదా గ్లూటెన్‌ సెన్సిటివిటీకి దారితీస్తంది. క్రమం తప్పకుండా ఓట్స్‌ తింటుంటే ప్రతికూల ప్రతి చర్యలకు దారితీస్తుంది. డైలీ తినాలనుకునేవారు పూర్తిగా గ్లూటెన్‌ రహిత ఓట్స్‌ని ఎంచుకోవాని చెబుతున్నారు. 

కడుపు వాపు
ఇవి ఒక్కోసారి గ్యాస్టిక్‌ వాపుని కలుగజేస్తాయి. ఆహారంలో ఆకస్మిక మార్పు వల్ల కలిగే ప్రభామే ఈ కడుపు వాపు. ఈ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే వోట్స్‌ తీసుకునే మొత్తాన్ని తగ్గించాలి. మోతాదుకి మించి ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్తపడాలి. 

ఫైటిక్‌ యాసిడ్‌లు
ఈ ఓట్స్‌లో ఫైటిక్‌ యాసిడ్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కాల్షియం, జింక్‌ వంటి ఖనిజాల శోషణను నిరోధిస్తుంది. ఓట్స్‌ని నానబెట్టడం లేదా పులియబెట్టడం వల్ల వాటిలో ఫైటిక్‌ యాసిడ్‌ కంటెంట్‌ తగ్గుతుంది.

(చదవండి:  భారతీయ యువతికి లండన్‌ ప్రతిష్టాత్మక అవార్డు! కింగ్ చార్లెస్‌ని..)

 

Advertisement
 
Advertisement
 
Advertisement